News August 9, 2025

సినీ కార్మికులపై కేసులు పెడితే ఊరుకోం: కోమటిరెడ్డి

image

TG: సినీ కార్మికులకు కొంతమేర వేతనాలు పెంచితే తప్పేంటని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. వారిపై కేసులు పెడితే ఊరుకోమని ఆయన హెచ్చరించారు. ‘మన కార్మికుల్లో నైపుణ్యం లేదంటే ఒప్పుకోను. నిర్మాతలను కలిసి వేతనాలు పెంచేందుకు కృషి చేస్తా. ఇందుకు ఈ నెల 11న ఇరువర్గాలతో చర్చలు జరుపుతాం. అలాగే మల్టీప్లెక్సుల్లో దోపిడీని అరికట్టేందుకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News August 9, 2025

వివేకా హత్యపై ఆధారాలు ఉంటే కోర్టుకు ఇవ్వండి: బొత్స

image

AP: చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే వివేకా హత్య జరిగిందని, ఆ సమయంలో కేసును సీబీఐకి ఎందుకు ఇవ్వలేదని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ‘జగన్ సీఎం అయ్యాకే కేసును సీబీఐకి అప్పగించారు. కూటమి అధికారంలోకి వచ్చి 14 నెలలు అవుతోంది. వివేకా హత్యపై ఆధారాలు ఉంటే కోర్టుకు ఇవ్వాలి. విశాఖ భూదోపిడీపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం. దీని వెనుక పెద్దల హస్తం ఉంది’ అని బొత్స ఆరోపించారు.

News August 9, 2025

4,408 ఉద్యోగాలు.. రేపే లాస్ట్ డేట్

image

APPSC అటవీ శాఖలో 691 ఉద్యోగాల భర్తీకి <<17304206>>నోటిఫికేషన్<<>> విడుదల చేసిన విషయం తెలిసిందే. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 256, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ 435 జాబ్స్‌కు అప్లై చేసుకునేందుకు రేపే చివరి తేదీ. https://psc.ap.gov.inలో అప్లై చేసుకోవచ్చు. మరోవైపు ఇంటెలిజెన్స్ బ్యూరో(IB)లో <<17130775>>3,717<<>> గ్రేడ్-2 పోస్టులకు అప్లై చేసుకునేందుకు రేపే లాస్ట్ డేట్. https://www.ncs.gov.in/లో దరఖాస్తు చేసుకోవచ్చు. SHARE IT

News August 9, 2025

2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు: APSDMA

image

AP: దక్షిణ కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ(APSDMA) పేర్కొంది. దీని ప్రభావంతో 2రోజుల పాటు రాష్ట్రంలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండరాదని హెచ్చరించింది.