News April 19, 2024

100 రోజుల్లో రుణ మాఫీ చేస్తామనలేదు: భట్టి

image

TG: మేడిగడ్డకు రూ.కోట్ల ప్రజాధనం వెచ్చించారని, అది కూలిపోతే వాస్తవాలు ప్రజలకు తెలియకూడదా? అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రశ్నించారు. రుణమాఫీపై స్పందిస్తూ.. ‘మేం 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పలేదు. కానీ రుణ మాఫీకి కట్టుబడి ఉన్నాం’ అని తెలిపారు. కరెంటు కోతలపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పరిశ్రమలకు నాణ్యమైన కరెంటు ఇస్తున్నామని చెప్పారు.

Similar News

News January 20, 2026

ఫైర్ సేఫ్టీ సంస్థలకు లైసెన్స్‌ల జారీకి కఠిన నిబంధనలు

image

TG: థర్డ్ పార్టీ ఫైర్ అండ్ లైఫ్ సేఫ్టీ ఆడిటర్లు, ఫైర్ అండ్ సేఫ్టీ ఇంటిగ్రేటర్లకు లైసెన్స్‌ల జారీ రూల్స్‌ను ప్రభుత్వం కఠినం చేసింది. ఈమేరకు GO జారీ చేసింది. వీరికి ఉండాల్సిన అర్హతలనూ నిర్దేశించింది. ఫైర్ సేఫ్టీ రూల్స్‌ను వివరిస్తూ అవి కచ్చితంగా అమలు కావలసిందేనని స్పష్టం చేసింది. బహుళ అంతస్తుల భవనాలకు ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ల జారీలో రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించింది.

News January 20, 2026

WPL: ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?

image

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ 154/5 రన్స్ చేసింది. సీవర్ బ్రంట్ 45 బంతుల్లో 65* పరుగులతో అదరగొట్టారు. ఓపెనర్ హర్మన్ ప్రీత్ 41 రన్స్‌ చేశారు. మిగతావారెవరూ రాణించకపోవడంతో MI భారీ స్కోర్ చేయలేకపోయింది. DC బౌలర్లలో తెలుగు తేజం శ్రీచరణి 3 వికెట్లతో సత్తా చాటారు. DC టార్గెట్ 155 రన్స్.

News January 20, 2026

TG సీఐడీ సంచలన నిర్ణయం

image

తెలంగాణ సీఐడీ సంచలన నిర్ణయం తీసుకుంది. బాధితుల ఇంటి వద్దకే వెళ్లి ఫిర్యాదులు స్వీకరించాలని నిర్ణయించింది. మహిళలు, పిల్లలపై జరిగే నేరాలు, శారీరక దాడులు, ఆస్తి వివాదాలు, పోక్సో చట్టం, SC/ST అట్రాసిటీ, ర్యాగింగ్ నిరోధక చట్టం, బాల్య వివాహాల నిషేధ చట్టం కేసుల్లో స్టేషన్‌కు రాలేని బాధితులకు ఈ నిర్ణయంతో ఊరట దక్కనుంది. ఫోన్‌/మౌఖికంగా సమాచారం అందిస్తే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి ఫిర్యాదు స్వీకరిస్తారు.