News January 11, 2025

వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా నిర్వహిస్తాం: CM

image

AP: స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న చరిత్రను నేటి తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు CM చంద్రబాబు తెలిపారు. ప్రథమ స్వాతంత్ర్య పోరాటంగా పరిగణించే సిపాయిల తిరుగుబాటుకు(1857) ముందే 1846లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డితో కలిసి ఓబన్న ఆంగ్లేయులతో వీరోచితంగా పోరాడారని గుర్తు చేశారు. నేడు ఆయన జయంతి సందర్భంగా ఆ మహనీయుని వీరగాథను స్మరించుకుందామన్నారు.

Similar News

News January 11, 2025

మూవీ కలెక్షన్స్.. గ్రాస్, నెట్ మధ్య తేడా ఇదే!

image

సినిమా కలెక్షన్లను గ్రాస్, నెట్, షేర్ అని ప్రకటిస్తుంటారు. మూడు పెద్ద సినిమాల విడుదల ఉండటంతో మరోసారి వాటి గురించి తెలుసుకుందాం. థియేటర్లలో టికెట్ సేల్స్ ద్వారా వచ్చే కలెక్షన్స్ గ్రాస్. అందులో ప్రభుత్వానికి కట్టే ట్యాక్స్ పోగా మిగిలేది నెట్. వీటిలో ఎగ్జిబిటర్లు, థియేటర్స్ పర్సంటేజ్ కట్ అయ్యాక ఫైనల్‌గా నిర్మాతకు దక్కేది షేర్ కింద లెక్కిస్తారు. ఇలా రూ.250 టికెట్‌లో నిర్మాతకు రూ.100 వస్తుంది.

News January 11, 2025

చాహల్‌తో డేటింగ్‌పై స్పందించిన యువతి

image

టీమ్ఇండియా బౌలర్ చాహల్ తన భార్య ధనశ్రీతో విడిపోనున్నట్లు వార్తలొస్తున్న వేళ ఓ అమ్మాయితో ఆయనున్న ఫొటో వైరలవుతోంది. RJ మహ్వాశ్‌తో ఆయన డేటింగ్‌లో ఉన్నట్లు నెటిజన్లు ఈ ఫొటో షేర్ చేస్తున్నారు. దీనిపై ఆమె తీవ్రంగా స్పందించారు. ‘ఇవన్నీ ఊహాగానాలే. ఒక అబ్బాయి, అమ్మాయితో తిరిగితే డేటింగేనా? రెండు మూడు రోజులుగా ఓపిగ్గా ఉన్నా. క్లిష్ట సమయంలో ఇతరులను తమ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో గడపనివ్వండి’ అని ఆమె పేర్కొన్నారు.

News January 11, 2025

193 ఏళ్ల క్రితం నీలవర్ణంలో సూర్యుడు.. కారణమిదే

image

1831లో ఓ విచిత్రం జరిగింది. ప్రపంచానికి సూర్యుడు నీలవర్ణంలో కనిపించాడు. దానికి కారణాన్ని స్కాట్లాండ్ పరిశోధకులు తాజాగా కనుగొన్నారు. రష్యా సమీపంలోని జవారిట్స్‌కీ అనే అగ్నిపర్వతం ఆ ఏడాది విస్ఫోటనం చెందిందని గుర్తించారు. దాన్నుంచి భారీగా వెలువడిన సల్ఫర్ డయాక్సైడ్ వాతావరణాన్ని కమ్మేసిందని పేర్కొన్నారు. అగ్నిపర్వత విస్ఫోటనం భూ వాతావరణాన్ని పూర్తిగా మార్చడానికి భవిష్యత్తులోనూ ఛాన్స్ ఉందని హెచ్చరించారు.