News February 17, 2025

గాజాలో నరకానికి తలుపులు తెరుస్తాం: నెతన్యాహు అల్టిమేటం

image

హమాస్‌కు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అల్టిమేటం జారీ చేశారు. వారి వద్ద బందీలుగా ఉన్న తమ దేశ పౌరుల్ని వెంటనే విడుదల చేయకపోతే గాజాలో నరకానికి తలుపులు తెరుస్తామని హెచ్చరించారు. ‘అమెరికాతో కలిసి మేం ఓ వ్యూహం రూపొందించాం. అది బయటికి చెప్పలేను కానీ మా పౌరుల్ని హమాస్ వదలకపోతే వారికి నరకద్వారాల్ని తెరవడం ఖాయం. ఆ సంస్థ సైనిక సామర్థ్యాన్ని, రాజకీయ పాలనను గాజా నుంచి తుడిచిపెట్టేస్తాం’ అని తేల్చిచెప్పారు.

Similar News

News November 7, 2025

DEC నుంచి మొబైల్ రీఛార్జ్ ధరలు పెంపు?

image

ప్రైవేట్ టెలికం కంపెనీలు డిసెంబర్ 1 నుంచి రీఛార్జ్ రేట్లను పెంచే అవకాశం ఉందని నేషనల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. దాదాపు 10% వరకు పెరగవచ్చని పేర్కొన్నాయి. 5G సర్వీస్ విస్తరణ, నెట్‌వర్క్ మెయింటనెన్స్ ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు, రెవెన్యూ పెంచుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. టారిఫ్స్ పెంచితే ఉదాహరణకు రోజుకు 2GB 84 రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్లాన్ ధర రూ.949 నుంచి రూ.999కి పెరిగే అవకాశం ఉంది.

News November 7, 2025

యువత కోసం CMEGP పథకం!

image

AP: యువతకు స్వయం ఉపాధి, ఉద్యోగ కల్పనే లక్ష్యంగా CM ఉపాధి కల్పన (CMEGP) పథకాన్ని ప్రభుత్వం త్వరలో ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్కీమ్‌కి ఏటా రూ.300 కోట్లు ఖర్చు చేయనుంది. గ్రామీణ యువతకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. సేవారంగంలో రూ.2లక్షల-రూ.20 లక్షలు, తయారీ రంగంలో రూ.10 లక్షల-రూ.50 లక్షల వరకు రుణాలు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశారని, ఈనెల 10న క్యాబినెట్‌లో దీనిపై చర్చించనున్నట్లు సమాచారం.

News November 7, 2025

మంత్రాల వల్ల నిజంగానే ఫలితం ఉంటుందా?

image

మంత్రాల శక్తిని కొందరు నమ్మకపోయినా, అవి నిజంగానే సానుకూల ప్రభావాన్ని చూపుతాయని అనేక నివేదికలు తెలియజేస్తున్నాయి. మంత్రాలను పదే పదే జపించడం ధ్యానంలాగా పనిచేస్తుంది. ఈ ప్రక్రియలో మనస్సు మంత్రంపై కేంద్రీకృతమై ఏకాగ్రత పెరుగుతుంది. మంత్ర జపంతో ఉత్పన్నమయ్యే లయబద్ధ శబ్ద తరంగాలు మనలో మానసిక ప్రశాంతతను పెంచి, ఒత్తిడిని తగ్గిస్తాయి. ఫలితంగా మనలో సానుకూల శక్తి పెరిగి, జీవితం పట్ల మంచి దృక్పథం కలుగుతుంది.