News November 7, 2024

దశలవారీగా సర్పంచుల బాకీలు చెల్లిస్తాం: మంత్రి శ్రీధర్‌బాబు

image

TG: సర్పంచుల బకాయిలను దశలవారీగా చెల్లిస్తామని మంత్రి శ్రీధర్‌బాబు హామీ ఇచ్చారు. BRS నేతల రెచ్చగొట్టే మాటలు ఎవరూ నమ్మి ఆందోళన చెందవద్దని ఆయన కోరారు. సర్పంచులకు చెందాల్సిన నిధులను BRS ప్రభుత్వం దారి మళ్లించలేదా? 60 మంది సర్పంచుల ఆత్మహత్యలకు కారణం కాలేదా? అని మంత్రి ప్రశ్నించారు. గత ప్రభుత్వం సర్పంచులకు బిల్లులు చెల్లించలేదని ఆయన అన్నారు.

Similar News

News January 6, 2026

తత్కాల్ టికెట్ బుకింగ్ టిప్.. ఈ ఫీచర్‌తో పని ఈజీ!

image

IRCTCలో తత్కాల్ టికెట్ త్వరగా బుక్ అవ్వాలంటే Master List ఫీచర్ వాడొచ్చు. ‘My Profile’లో ప్రయాణికుల పేర్లు, వయసు, ఆధార్ వివరాలను ముందే సేవ్ చేసుకోవచ్చు. దీనివల్ల బుకింగ్ టైమ్‌లో మళ్లీ టైప్ చేసే పని ఉండదు. కేవలం ఒక్క క్లిక్‌తో ప్యాసింజర్ డీటెయిల్స్ యాడ్ అవుతాయి. టైమ్ ఆదా అవ్వడమే కాకుండా తత్కాల్ సీటు దొరికే ఛాన్స్ పెరుగుతుంది. గరిష్ఠంగా 12 మంది వివరాలను ఇందులో స్టోర్ చేసుకోవచ్చు.

News January 6, 2026

బంగారు పేపర్లతో భగవద్గీత

image

కర్ణాటకలోని ప్రసిద్ధ ఉడుపి శ్రీకృష్ణ మఠానికి అపురూపమైన కానుక అందింది. ఢిల్లీకి చెందిన ఓ భక్తుడు రూ.2 కోట్ల విలువైన బంగారు పేపర్లతో రూపొందించిన స్వర్ణ భగవద్గీతను సమర్పించారు. 18 అధ్యాయాలు, 700 శ్లోకాలతో రూపొందిన ఈ గ్రంథాన్ని విశ్వగీతా పర్యాయ ముగింపు రోజున మఠాధిపతి విద్యాధీశతీర్థ స్వామికి అందజేయనున్నారు. ఈ నెల 8న బంగారు రథంలో ఊరేగింపుగా తీసుకొచ్చి మఠానికి బహూకరించనున్నారు.

News January 6, 2026

AIలో 83% విద్యార్థులకు ఉద్యోగాలు

image

TG: IIT హైదరాబాద్‌లో 62.42% మందికి ఉద్యోగాలు వచ్చినట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ BS మూర్తి తెలిపారు. ఈ సారి మొత్తం 487 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 304 మందికి ఉద్యోగాలు లభించాయని పేర్కొన్నారు. సగటు వార్షిక ప్యాకేజీ రూ.30 లక్షలుగా ఉన్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా AI విభాగంలో 83.3% విద్యార్థులకు ప్లేస్‌మెంట్స్ రావడం విశేషం. CSE విద్యార్థి ఎడ్వర్డ్ <<18734504>>వర్గీస్‌<<>>కు రూ.2.5 కోట్ల ప్యాకేజీతో జాబ్ వచ్చింది.