News October 10, 2025

త్వరలోనే పెండింగ్ రాయితీలు చెల్లిస్తాం: లోకేశ్

image

AP: IT, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు త్వరలోనే పెండింగ్ రాయితీలు చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు. ఆ శాఖపై సమీక్ష సందర్భంగా మాట్లాడుతూ.. ‘స్టార్టప్‌ల వృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలి. మరో 2 నెలల్లో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా వెయ్యి సేవలను అందుబాటులోకి తేవాలి’ అని అన్నారు. రేపు క్యాబినెట్ భేటీలో ప్రవేశపెట్టనున్న క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీపైనా చర్చించారు.

Similar News

News October 10, 2025

పొత్తుపై EPS వ్యాఖ్యలు.. ఖండించిన TVK

image

విజయ్ పార్టీ TVKతో పొత్తుపై AIADMK నేత E.పళనిస్వామి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. TNలో ఎన్డీయే కూటమి కోసం ఇప్పటికే పని ప్రారంభమైందని చెప్పారు. నమక్కల్ జిల్లాలో తన ప్రచారంలో కొందరు TVK జెండాలను ఊపడంపై ఆయన స్పందిస్తూ ‘చర్యలు మొదలయ్యాయి. ఇది విప్లవ ధ్వని. ఈ శబ్దాన్ని మీరు (DMK) తట్టుకోలేరు’ అని అన్నారు. పొత్తులు తప్పనిసరని, తమ కూటమి మరింత బలపడుతుందని చెప్పారు. అయితే పళని వ్యాఖ్యలను టీవీకే ఖండించింది.

News October 10, 2025

ఇతిహాసాలు క్విజ్ – 31

image

1. విశ్వామిత్రుని ఆశ్రమం పేరేంటి?
2. బర్బరీకుడి తండ్రి ఎవరు?
3. పోతన తన ‘ఆంధ్ర మహాభాగవతం’ గ్రంథాన్ని ఎవరికి అంకితం ఇచ్చాడు?
4. కామ దేవుని వాహనం ఏది?
5. సంస్కృతంలో లక్ష(సంఖ్య)ను ఏమని అంటారు?
✍️ సరైన సమాధానాలను సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>

News October 10, 2025

IOCLలో 523పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL)లో 523 గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్‌ పోస్టులకు అప్లై చేయడానికి రేపే(OCT 11)ఆఖరు తేదీ. డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ చేసినవారు అర్హులు. అభ్యర్థుల వయసు 18 నుంచి 24ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు కలదు. విద్యార్హతలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://iocl.com/