News January 12, 2025
బహిరంగ మద్యం విక్రయాలను అడ్డుకుంటాం: విజయవాడ సీపీ

AP: కోడి పందేల శిబిరాలను డ్రోన్లతో పర్యవేక్షించనున్నట్లు విజయవాడ సీపీ రాజశేఖర్ తెలిపారు. శిబిరాల వద్ద బహిరంగ మద్యం విక్రయాలను అడ్డుకుంటామన్నారు. కోళ్లకు కత్తి కట్టి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గుండాట, పేకాట, క్యాసినోలు జరగనివ్వమని చెప్పారు. సంక్రాంతి అంటే కోడి పందేలు, జూదం, గుండాట, క్యాసినో కాదని అన్నారు. సంప్రదాయ ఆటలు ఆడుతూ పండుగ జరుపుకోవాలని ప్రజలకు సూచించారు.
Similar News
News October 19, 2025
రాష్ట్రానికి ప్రధాన రథచక్రాలు ఉద్యోగులే: CM

AP: ఉద్యోగులకు దీపావళి వేళ శుభవార్త చెప్పాలనే ఉద్దేశంతోనే వారితో సమావేశమైనట్లు CM చంద్రబాబు తెలిపారు. ‘ఉద్యోగులు సంతోషంగా ఉండి అంతా కలిసి పనిచేస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రానికి ప్రధాన రథచక్రాలు ఉద్యోగులే. పాలసీలు మేం తీసుకువచ్చినా వాటిని అమలు చేసే బాధ్యత వారిదే. ఉద్యోగులు, NDA కార్యకర్తలు ఎవరు తప్పు చేసినా ప్రభుత్వానికే చెడ్డపేరు వస్తుంది’ అని మీడియా సమావేశంలో పేర్కొన్నారు.
News October 19, 2025
కల్తీ/అసలైన వెండిని ఇలా గుర్తించండి!

*వెండిపై ఉండే హాల్ మార్క్‌ను టెస్టు చేయాలి. 925 ఉంటే వెండిలో 92.5% ప్యూర్ సిల్వర్, 7.5% రాగి ఉన్నట్టు లెక్క. 999 ఉంటే 99.9% ప్యూర్ అని అర్థం.
*వెండి దగ్గర అయస్కాంతం పెడితే అతుక్కోదు. నకిలీ వెండి అతుక్కుంటుంది.
*వెండికి అధిక ఉష్ణ వాహకత (Thermal conductivity)ఉంటుంది. వెండిపై మంచు ముక్క పెడితే త్వరగా కరిగిపోతుంది.
*వెండిని మరో వెండి ముక్కతో కొడితే క్లియర్ సౌండ్ వస్తుంది.
News October 18, 2025
జమ్మూకశ్మీర్‌పై సరైన సమయంలో నిర్ణయం: అమిత్ షా

జమ్మూకశ్మీర్‌కు సరైన సమయంలో రాష్ట్ర హోదా కల్పిస్తామని కేంద్ర మంత్రి అమిత్ షా వెల్లడించారు. లద్దాక్ విషయంలో లేవనెత్తిన డిమాండ్లకు సరైన పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. అయితే వారు ఓపికగా ఉండాలని కోరారు. బిహార్‌లోని పట్నాలో ఓ మీడియా కాన్క్లేవ్లో ఆయన మాట్లాడారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత J&Kలో సమూల మార్పులు జరిగాయని, గత 9 నెలల్లో స్థానికంగా ఒక్క టెర్రరిస్టు రిక్రూట్మెంట్ కూడా జరగలేదని చెప్పారు.