News March 24, 2024
ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తాం: పవన్ కళ్యాణ్

AP: అధికారులు మోసం చేశారంటూ YSR జిల్లాలో కుటుంబం <<12908035>>ఆత్మహత్య<<>> చేసుకున్న ఘటనపై సమగ్ర విచారణ చేయాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ‘YCP నేతల భూకబ్జాలకు పేదలు బలైపోతున్నారు. ప్రజల ఆస్తులను హస్తగతం చేసుకునేందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను ప్రభుత్వం తీసుకొచ్చింది. రాబోయే ఉమ్మడి ప్రభుత్వంలో ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తాం. భూదందాలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు.
Similar News
News November 19, 2025
సైలెంట్‌గా రీఛార్జ్ వ్యాలిడిటీని తగ్గించిన BSNL!

ఎయిర్టెల్, జియోలే కాకుండా ప్రభుత్వరంగ సంస్థ BSNL కూడా నిశ్శబ్దంగా రీఛార్జ్ ప్యాకేజీల్లో మార్పులు తీసుకొస్తోంది. BSNL తన రూ.107 ప్రీపెయిడ్ ప్లాన్ చెల్లుబాటును 28 రోజుల నుంచి 22 రోజులకు కుదించింది. గతంలో ఇదే రీఛార్జ్‌పై 35 రోజులు వ్యాలిడిటీ ఉండేది. ధరను పెంచకుండా ఇలా ప్లాన్ చేస్తోంది. ఇది 20% కంటే ఎక్కువ టారిఫ్ పెంపునకు సమానమని టెక్ నిపుణులు చెబుతున్నారు. దీనిపై పలువురు విమర్శలు చేస్తున్నారు.
News November 19, 2025
యువత 20 ఏళ్లలోపు పెళ్లి చేసుకోవాలి: శ్రీధర్

యువత పెళ్లి కంటే కెరీర్‌పై ఫోకస్ చేయడం న్యూ ప్రోగ్రెసివ్ ఇండియాకు సంకేతమన్న ఉపాసన <<18317940>>వ్యాఖ్యలపై<<>> ZOHO ఫౌండర్ శ్రీధర్ వెంబు స్పందించారు. యువ వ్యాపారవేత్తలు, స్త్రీ, పురుషులు 20 ఏళ్లలోపే పెళ్లి చేసుకోవాలని తాను సూచిస్తానన్నారు. ‘సమాజానికి జనాభాను అందించే డ్యూటీని యువత నిర్వర్తించాలి. ఆ ఆలోచనలు విచిత్రంగా, పాతచింతకాయ పచ్చడిలా అనిపిస్తాయి. కానీ కాలక్రమంలో అందరూ దీన్నే అనుసరిస్తారు’ అని పేర్కొన్నారు.
News November 19, 2025
రెండేళ్లుగా కూతురిని ఇంట్లోనే బంధించిన తల్లి.. ఎందుకంటే?

AP: శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి చెందిన బాలిక 9వ తరగతి వరకు చదువుకుంది. రజస్వల అయిన తర్వాత “బయట ప్రపంచం ప్రమాదం” అనే భయంతో రెండేళ్ల పాటు తల్లి భాగ్యలక్ష్మి ఆమెను ఇంటికే పరిమితం చేసింది. భర్త మృతితో ఒంటరిగా మారిన తల్లి తన భయాలను కుమార్తెకు రుద్దింది. అధికారులు జోక్యం చేసుకొని తల్లీకుమార్తెలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అనారోగ్యంతో ఉన్న తల్లిని KGHకు, మౌనికను సంరక్షణ కేంద్రానికి తరలించారు.


