News September 10, 2025
రామరాజ్యం లాంటి పాలన ఇస్తాం: CM

AP: రాష్ట్ర ప్రజలకు రామరాజ్యం లాంటి పాలన అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘నేను, పవన్ కళ్యాణ్, మాధవ్ కలిసి సుపరిపాలన అందిస్తాం. నేను నాలుగో సారి సీఎంను. సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు కామన్ మ్యాన్. ఎమ్మెల్యేలందరూ కామన్ మ్యాన్‌లాగే ఉండాలి. దర్జాలు, ఆర్భాటాలు పనికిరావు. ఎవరూ అహంకారాన్ని ప్రదర్శించవద్దు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కాబట్టే పనులు వేగంగా అవుతున్నాయి’ అని అనంతపురంలో వివరించారు.
Similar News
News March 30, 2026
HYD: బల్దియా సార్ల లీలలు.. చూస్తే కళ్లు బైర్లు!

బల్దియా సార్ల లీలలు మామూలుగా లేవు! జనాల ట్యాక్స్ డబ్బులు కాంట్రాక్టర్లకు ఎలా ఇచ్చారో కాగ్ రిపోర్టు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. పని పూర్తికాకముందే ఒకే కాంట్రాక్టర్‌కు ఏకంగా ₹302 కోట్ల బిల్లులు గుమ్మరించారు. నిబంధనలను తుంగలో తొక్కి, MB రికార్డుల్లో మాయా చేశారు. పనులు చేయకున్నా జెట్ స్పీడ్‌లో బిల్లుల చెల్లించారు. అధికారుల కృపతో ప్రభుత్వ ఖజానాకు భారీ కన్నం పడింది. ఇది సిటీలో హాట్ టాపిక్ అయింది.
News March 30, 2026
ఏప్రిల్ 4వ వారంలో టెన్త్ ఫలితాలు

AP: టెన్త్ పరీక్ష ఫలితాలు APR 4వ వారంలో విడుదల చేసేందుకు SSC బోర్డు చర్యలు చేపట్టింది. APR2తో పరీక్షలు ముగుస్తాయి. జవాబు పత్రాల మూల్యాంకనం 6-15 తేదీ వరకు జరుగుతుంది. అనంతరం OMR స్కానింగ్ ఉంటుంది. ఆన్సర్ షీట్లలో తేడాలుంటే వెరిఫికేషన్‌కు జిల్లాలను సంప్రదించడం, వాల్యుయేషన్ పత్రాల ర్యాండమ్ చెకప్ అనంతరం కంప్యూటరీకరణ చేస్తుంది. ఇవి పూర్తయ్యాక 30లోపు రిజల్ట్స్ ప్రకటిస్తామని బోర్డు అధికారి ఒకరు తెలిపారు.
News March 30, 2026
వాహనదారులకు షాక్.. పెరిగిన CNG ధర

TG: CNG వాహనదారులకు షాక్ తగిలింది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దిగుమతికి ఆటంకంతో సరఫరా మరింత తగ్గింది. ఇదే సాకుతో గ్యాస్ కంపెనీలు ధరలు పెంచేస్తున్నాయి. 3 రోజుల క్రితం వరకు కిలోపై అదనంగా ₹1 చొప్పున వసూలు చేసిన HYDలోని ఓ PVT గ్యాస్ కంపెనీ ఆ తరువాత నుంచి మరో రూ.2 పెంచి విక్రయిస్తోంది. వారం కిందట ఈ ధర ₹96గా ఉండగా శనివారం నుంచి అన్ని బంకుల్లో KG ₹99 చొప్పున CNG స్టేషన్లలో వసూలు చేస్తున్నారు.


