News February 12, 2025

అంతరాయం లేకుండా విద్యుత్ అందిస్తాం: భట్టి

image

TG: రాష్ట్రంలో రోజురోజుకు విద్యుత్ <<15416781>>డిమాండ్<<>> పెరుగుతున్న నేపథ్యంలో TGSPDCL అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి సమావేశం నిర్వహించారు. వేసవిలో విద్యుత్ సరఫరా ప్రణాళికలపై చర్చించారు. రానున్న రోజుల్లో డిమాండ్ ఎంత పెరిగినా రెప్పపాటు అంతరాయం లేకుండా అవసరమైన విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. వినియోగదారులకు ఎలాంటి సమస్యలు తలెత్తినా 1912 టోల్ ప్రీ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

Similar News

News February 12, 2025

ఈనెల 18 నుంచి స్కూళ్లలో భాషోత్సవాలు

image

AP: విద్యార్థుల్లో భాషా నైపుణ్యాలను పెంపొందించేందుకు ఈనెల 18 నుంచి 21వ తేదీ వరకు స్కూళ్లలో భాషోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. 18న ఇంగ్లిష్, 19న సంస్కృతం, హిందీ, ఉర్దూ, 20న గిరిజన భాషలు, కన్నడ, తమిళం, ఒరియా, 21న తెలుగు లాంగ్వేజ్ ఫెస్టివల్స్ నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. చదవడం, రాయడం, స్టోరీ టెల్లింగ్, క్విజ్ వంటి పోటీలు పెట్టాలని సూచించింది.

News February 12, 2025

‘లైలా’కు నందమూరి అభిమానుల మద్దతు

image

నటుడు పృథ్వీ వ్యాఖ్యలతో <<15413032>>బాయ్‌కాట్ లైలా<<>> అంటూ వైసీపీ శ్రేణులు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై హీరో విశ్వక్‌ వివరణ ఇచ్చుకున్నప్పటికీ వారు వెనక్కితగ్గలేదు. ఈక్రమంలో ఆయనకు మద్దతుగా నందమూరి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో #WesupportLaila అంటూ ట్రెండ్ చేస్తున్నారు. మూవీ బాగుంటే ఎవరూ ఆపలేరని, ఒక నటుడు చేసిన వ్యాఖ్యలతో సినిమాను బాయ్‌కాట్ చేయడం కరెక్ట్ కాదని చెబుతున్నారు.

News February 12, 2025

వాన్స్ కుటుంబంతో పీఎం మోదీ

image

ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుటుంబాన్ని కలిశారు. వాన్స్, ఆయన భార్య ఉష చిలుకూరి, వారి పిల్లలతో కలిసి ఫొటో దిగారు. వివిధ అంశాలపై మంచి చర్చ జరిగిందని పేర్కొన్నారు. తమ కుమారుడి పుట్టినరోజు సందర్భంగా మోదీ ఇచ్చిన గిఫ్ట్స్ అద్భుతంగా ఉన్నాయని వాన్స్ ట్వీట్ చేశారు. పిల్లలు ఆయన్ను ఎంతో ఇష్టపడ్డారని రాసుకొచ్చారు. కాగా ఉష తల్లిదండ్రులది ఏపీలోని కృష్ణా జిల్లా.

error: Content is protected !!