News December 21, 2024

సంక్రాంతికల్లా రైతు భరోసా ఇస్తాం: తుమ్మల

image

TG: సంక్రాంతికల్లా రైతు భరోసా అందివ్వనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసెంబ్లీ చర్చలో తెలిపారు. ‘గత ప్రభుత్వం రైతుబంధు కింద రైతులకు రూ.80 వేలకోట్లు ఇచ్చింది. సాగుచేయని భూములకు కూడా డబ్బులు అందాయి. అలా కాకుండా కేవలం సాగుభూములకే భరోసా అందించేందుకు సబ్‌కమిటీ ఏర్పాటు చేశాం. రైతు భరోసాపై సభ్యులు సలహా ఇస్తే స్వీకరిస్తాం’ అని పేర్కొన్నారు.

Similar News

News February 1, 2026

నిర్మలమ్మ చీరలే స్పెషల్ ఎట్రాక్షన్

image

ఏటా బడ్జెట్ సమయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ధరించే చేనేత చీరలు కూడా స్పెషల్‌గా నిలుస్తాయి. ఈసారి బంగారు, నలుపు వర్ణం అంచుతో ఉన్న మెరూన్‌ రంగు కాంజీవరం చీర, గోల్డెన్‌ కలర్‌ బ్లౌజ్‌, శాలువాతో కన్పించారు. 2025లో మధుబని చిత్రాలున్న చీర, 2024లో కాంతా చీర, 2023లో టెంపుల్ బోర్డర్ శారీ, 2022లో ఒడిశా చేనేత శారీ, 2021లో భూదాన్‌ పోచంపల్లి చీర, 2020లో బంగారు వర్ణపు చీర, 2019లో మంగళగిరి చీర ధరించారు.

News February 1, 2026

భూముల్లో సూక్ష్మపోషక లోపాలు ఎందుకు వస్తాయి?

image

తెలుగు రాష్ట్రాల్లోని భూముల్లో జింకు, ఇనుము, బోరాన్ లోపం ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. బెట్టకు గురయ్యే నేలల్లో బోరాన్, ఇనుము, మాంగనీసు లోపం.. నీరు నిలిచే లోతట్టు భూములు, మురుగు నీరు పోని భూములు, అన్నివేళలా నీరు పెట్టే వరి పొలాల్లో జింక్ లోపం వచ్చే అవకాశం ఎక్కువ. సాగు నీటిలో కార్బోనేట్స్, బైకార్బోనేట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, నేలలో సున్నం పాళ్లు ఎక్కువైనప్పుడు ఇనుపదాతు లోపం కనిపిస్తోంది.

News February 1, 2026

జిల్లాకో గర్ల్స్ హాస్టల్: కేంద్రం ప్రకటన

image

సైన్స్ టెక్నాలజీ, ఇంజినీరింగ్, మెడికల్ వంటి ఉన్నత విద్యా కోర్సులు అభ్యసిస్తున్న మహిళల కోసం ప్రతి జిల్లాలో ప్రత్యేక వసతి గృహాలను ఏర్పాటుచేయాలని కేంద్రం బడ్జెట్లో ప్రకటించింది. కాలేజీ తరగతులు, ల్యాబుల్లో పరిశోధనలు ఇతర అధ్యయనాలకు ఎక్కువ కాలం వారు వెచ్చించాల్సి వస్తోంది. వారు సవాళ్లు ఎదుర్కొంటున్నారని, వారికి సదుపాయంగా ఈ హాస్టళ్లను ఏర్పాటుచేస్తున్నట్లు మంత్రి వివరించారు.