News March 18, 2024
ఎమ్మిగనూరులో మళ్లీ వైసీపీ జెండా ఎగరేస్తాం: బుట్టా రేణుక

ఎమ్మిగనూరు నియోజకవర్గంలో మళ్లీ వైసీపీ జెండానే ఎగరవేస్తామని ఆ పార్టీ అభ్యర్థి బుట్టా రేణుక ధీమా వ్యక్తం చేశారు. సోమవారం ఎమ్మిగనూరులోని పలు ప్రాంతాల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చేనేత కార్మికులను కలిసి మగ్గం అల్లారు. మహిళలతో కలిసి కుట్టు మిషన్లు కుట్టారు. అభివృద్ధి, సంక్షేమం వైసీపీకి రెండు కళ్ళ లాంటివన్నారు. వచ్చే ఎన్నికల్లో తనను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానన్నారు.
Similar News
News January 26, 2026
రాష్ట్రస్థాయి కబడ్డీ జట్టుకు బాలికల ఎంపిక

రాష్ట్ర జట్టుకు ఎంపికైన బాలికల కబడ్డీ క్రీడాకారులను అసోసియేషన్ జిల్లా జాయింట్ సెక్రటరీ అమర్ ప్రకాష్ ఆదివారం ఆదోనిలో అభినందించారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 27 వరకు అనకాపల్లిలో రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నీ జరుగుతుందన్నారు. కర్నూలు జిల్లా టీమ్ తరఫున కోసిగి, ఆదోని నుంచి కీర్తన, వీరేషమ్మ, సౌమ్య, పల్లవి, శిరీష ఆడతారన్నారు. కోసిగి కస్తూర్బా స్కూల్ PET సుమలత కోచ్గా ఎంపికయ్యారని తెలిపారు.
News January 26, 2026
అనుమానితులపై ప్రత్యేక నిఘా: ఎస్పీ

గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని కర్నూలు జిల్లాలో ఏలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నేరాల నియంత్రణకు, అనుమానాస్పద వ్యక్తుల ఆచూకి కనిపెట్టేందుకు ఆదివారం రాత్రి జిల్లా పోలీసులు ఆకస్మికంగా పలు లాడ్జిల్లో జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. అనుమానితులపై నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.
News January 25, 2026
ఆస్పరి: రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

ఆస్పరి మండలం చిన్నహోతూరు గ్రామానికి చెందిన తలారి నాగరాజు (35) ఆదివారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆస్పరి-నగరూరు రైల్వే స్టేషన్ల మధ్య ముంబై నుంచి చెన్నై వెళ్లే ఎక్స్ప్రెస్ రైలు కిందపడి ఆయన ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న రైల్వే హెడ్ కానిస్టేబుల్ శివరామయ్య ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


