News May 7, 2025

RCBలాగే మేమూ ప్లేఆఫ్స్ చేరుతాం: నితీశ్

image

IPL 2025: SRH ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుందని ఆ జట్టు ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ‘గతేడాది RCB వరుసగా 7 మ్యాచులు గెలిచి ప్లేఆఫ్స్‌కు చేరింది. ఈసారి మేమూ అలాగే చేరుకుంటాం. ఇందుకోసం 100% ప్రయత్నిస్తాం. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం’ అని అన్నారు. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో SRH ఎనిమిదో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే మిగతా 5 మ్యాచులు గెలవడంతో పాటు మెరుగైన NRR కలిగి ఉండాలి.

Similar News

News March 24, 2026

స్మార్ట్‌ఫోన్ అతిగా చూస్తే ఈటింగ్ డిజార్డర్స్

image

స్మార్ట్‌ఫోన్ అతిగా వాడటం వల్ల కేవలం కంటి సమస్యలే కాకుండా ‘ఈటింగ్ డిజార్డర్స్’ కూడా వస్తాయని తాజా పరిశోధనలో తేలింది. ముఖ్యంగా రోజుకు 7 గంటల కంటే ఎక్కువ సమయం ఫోన్‌తో గడిపే యూత్‌లో ఈ ముప్పు ఎక్కువగా ఉంది. ఆన్‌లైన్‌లో కనిపించే ఐడియల్ బాడీ షేప్‌తొ తమను పోల్చుకోవడం వల్ల మెంటల్ టెన్షన్‌కు లోనై అదుపు లేకుండా తినడం లేదా అసలు తినకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని తేలింది.

News March 24, 2026

మార్చి 24: చరిత్రలో ఈరోజు

image

1603: బ్రిటిషు మహారాణి ఎలిజబెత్ మరణం
1775: కవి, వాగ్గేయకారుడు ముత్తుస్వామి దీక్షితులు జననం
1882: క్షయ వ్యాధికి కారణమైన మైకోబాక్టీరియా ట్యుబర్‌క్యులాసిస్‌ను రాబర్ట్ కోచ్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు
1977: భారత ప్రధానిగా మొరార్జీ దేశాయ్ బాధ్యతలు (ఫొటోలో)
1984 : భారత హాకీ క్రీడాకారుడు ఆడ్రియన్ డిసౌజా జననం
1991: సినీ గేయ రచయిత చెరువు ఆంజనేయ శాస్త్రి మరణం
* ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం

News March 24, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.