News June 15, 2024
YCP నేతలు తిన్న సొమ్మంతా కక్కిస్తాం: మంత్రి రాంప్రసాద్ రెడ్డి

AP: గత ఐదేళ్లలో వైసీపీ నేతలు తిన్న సొమ్మంతా కక్కించే వరకు వదిలిపెట్టమని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని ఆ పార్టీ నేతలు దోచుకున్నారని విమర్శించారు. వారు ఎక్కడ దాచినా బయటికి తీసుకొస్తామని పేర్కొన్నారు. కాగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కసరత్తు చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే దీనిపై ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.
Similar News
News November 7, 2025
264 పోలీస్ ఉద్యోగాల భర్తీకి అనుమతి

AP: నిరుద్యోగులకు శుభవార్త. ఏపీఎస్పీలో 19 SI, 245 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2026-27లో 10 SI, 125 కానిస్టేబుల్, 2027-28లో 9 SI, 120 కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయాలని పేర్కొంది. ఈ మేరకు పోలీసు నియామక మండలికి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులిచ్చింది. దీంతో త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.
News November 7, 2025
ఏటా 5-10% పెరగనున్న ఇళ్ల ధరలు

ప్రస్తుతం దేశంలో ఏటా ఇళ్ల అమ్మకాలు 3-4L యూనిట్లుగా ఉండగా 2047 నాటికి రెట్టింపవుతాయని CII, కొలియర్స్ ఇండియా అంచనా వేశాయి. భారీ డిమాండ్ వల్ల 2 దశాబ్దాలపాటు ఏటా 5-10% మేర గృహాల రేట్లు పెరుగుతాయని పేర్కొన్నాయి. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మార్కెట్ విలువ $0.3 ట్రిలియన్లుగా ఉండగా 2047కు $5-10 ట్రిలియన్లకు పెరగొచ్చని తెలిపాయి. మౌలిక వసతులు, రవాణా, వరల్డ్ క్లాస్ నిర్మాణాలు ప్రభావం చూపుతాయని అభిప్రాయపడ్డాయి.
News November 7, 2025
NEEPCOలో 98 పోస్టులకు అప్లై చేశారా?

NTPC అనుబంధ సంస్థ నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (<


