News June 16, 2024
ఆరోగ్యశ్రీలో అవకతవకలపై శ్వేతపత్రం విడుదల చేస్తాం: మంత్రి సత్యకుమార్

AP: గత ప్రభుత్వం వైద్య రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు. ఆరోగ్యశ్రీలో అవకతవకలు జరిగాయని, నిధుల దుర్వినియోగంపై శ్వేతపత్రం విడుదల చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ‘ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తాం. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, మెడికల్ ఎక్విప్‌మెంట్ అందుబాటులో ఉండేలా చూస్తాం. క్యాన్సర్ రహిత ఏపీ దిశగా అడుగులు వేస్తాం’ అని పేర్కొన్నారు.
Similar News
News November 24, 2025
పేరుపాలెం బీచ్‌లో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

పేరుపాలెం బీచ్ లో ఆదివారం సముద్ర స్నానం చేస్తూ ఒక యువకుడు గల్లంతైన విషయం తెలిసిందే. ఏలూరు కొత్తపేటకు చెందిన మునగాల మోహన్ సాయి గణేశ్ (19) మిత్రులతో కలిసి అలల్లో స్నానం చేస్తూ ఉద్ధృతికి కొట్టుకుపోయాడు. అధికారులు నిన్నటి నుంచి గాలిస్తుండగా సోమవారం మోళ్లపర్రులో బీచ్‌లో లభ్యమైంది. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
News November 24, 2025
ఘోర ప్రమాదం.. భయానక ఫొటో

TG: హైదరాబాద్ శామీర్‌పేట ORR మీద ఘోర ప్రమాదం జరిగింది. రన్నింగ్ కారులో మంటలు చెలరేగి నిమిషాల్లోనే మొత్తం దగ్ధమైంది. కూర్చున్న సీటులోనే డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. అతని అస్థిపంజరం మాత్రమే మిగిలింది. ఇందుకు సంబంధించిన భయానక ఫొటో ఉలికిపాటుకు గురిచేస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. సీట్ బెల్ట్ లాక్ అవడంతోనే డ్రైవర్ బయటకు రాలేకపోయినట్లు తెలుస్తోంది.
News November 24, 2025
భారత్-కెనడా మధ్య ట్రేడ్ టాక్స్ పున:ప్రారంభం!

జస్టిన్ ట్రూడో హయాంలో దెబ్బతిన్న కెనడా-భారత్ సంబంధాల పునరుద్ధరణకు అడుగులు పడుతున్నాయి. ద్వైపాక్షిక వాణిజ్యం ఒప్పందాలపై చర్చలను ప్రారంభించేందుకు ఇరు దేశాల PMలు మోదీ, మార్క్ కార్నీ G20 సదస్సులో నిర్ణయించారు. వచ్చే ఏడాది భారత్‌లో పర్యటించేందుకు కార్నీ అంగీకరించారు. రెండు దేశాల మధ్య గత ఏడాది $22 బిలియన్ల వాణిజ్యం జరగగా, 2030 నాటికి $50 బిలియన్లకు చేర్చడమే లక్ష్యమని విదేశాంగశాఖ తెలిపింది.


