News August 20, 2025
వారి పింఛన్లు తొలగిస్తాం: పార్థసారథి

AP: గత ప్రభుత్వం అనర్హులకూ దివ్యాంగుల పింఛన్లు ఇచ్చిందని మంత్రి పార్థసారధి ఆరోపించారు. ‘ఇప్పటివరకు 4.50 లక్షల మందిలో లక్ష మంది అనర్హులను గుర్తించాం. రీవెరిఫై చేయించుకోని వారికి మళ్లీ నోటీసులిస్తాం. అయినా ముందుకు రాకపోతే వారి పింఛన్లను నిలిపివేస్తాం. వైద్యులు అనర్హులు అని చెప్తే మరోసారి తమ అర్జీని మండల అభివృద్ధి అధికారికి/మున్సిపల్ కమిషనర్‌కు అందజేస్తే వారి అర్హతను పరిశీలిస్తాం’ అని పేర్కొన్నారు.
Similar News
News August 21, 2025
శ్రీశైలం ఘటనపై పవన్ కళ్యాణ్ సీరియస్

AP: శ్రీశైలం ఫారెస్ట్ అధికారులపై దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయాలని Dy.CM పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ ఘటనపై సవివరంగా నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులకు సూచించారు. ‘తాము తప్పు చేసినా ఉపేక్షించొద్దని చంద్రబాబు, నేను అసెంబ్లీలో స్పష్టం చేశాం. ప్రజా జీవితంలో ఉన్నవారు తమను తాము నియంత్రించుకోవాలి. ఉద్యోగుల విధి నిర్వహణను ఆటంకం కలిగించేవారు ఏ స్థాయిలో ఉన్నా ఉపేక్షించొద్దు’ అని ఆయన ట్వీట్ చేశారు.
News August 21, 2025
ఆగస్టు 21: చరిత్రలో ఈ రోజు

1914: సంగీత దర్శకుడు పి.ఆదినారాయణరావు జననం
1963: నటి రాధిక జననం
1978: భారత మాజీ క్రికెటర్ వినూ మన్కడ్ మరణం
1978: నటి భూమిక చావ్లా జననం
1986: జమైకన్ అథ్లెట్ ఉసేన్ బోల్ట్ జననం
1998: హీరోయిన్ డింపుల్ హయాతి జననం
2013: ‘సాహిత్య అకాడమీ’ గ్రహీత మాలతీ చందూర్ మరణం
* జాతీయ వృద్ధుల దినోత్సవం
News August 21, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.