News August 13, 2024

తుంగభద్ర గేట్‌ను పునరుద్ధరిస్తాం: ఏపీ మంత్రులు

image

AP: తుంగభద్ర డ్యామ్ గేట్‌ను పునరుద్ధరిస్తామని ఏపీ మంత్రులు రామానాయుడు, పయ్యావుల కేశవ్ తెలిపారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో కలిసి డ్యామ్‌ను పరిశీలించారు. చైన్ కట్ కావడంతోనే 19వ గేట్ కొట్టుకుపోయినట్లు తెలిపారు. ఆ గేట్ నుంచి 35 వేల క్యూసెక్కుల నీరు వెళ్తోందని చెప్పారు. డ్యామ్‌లో నీటి మట్టం తగ్గాకే పునరుద్ధరణ సాధ్యమని, నారాయణ ఇంజినీరింగ్ ఏజెన్సీ ఆ పనులు చేపడుతుందని తెలిపారు.

Similar News

News December 3, 2025

₹274 కోట్లు దోచి పరారైన డోన్ రియల్టర్!

image

డోన్‌కు చెందిన ఓ స్థిరాస్తి వ్యాపారి ఏపీ, తెలంగాణ, కర్ణాటకలోని ప్రముఖుల నుంచి ₹274 కోట్లు అప్పులు, పెట్టుబడుల రూపంలో వసూలు చేసి అమెరికా పరారయ్యాడు. చిరుద్యోగి అయిన అతడు స్థిరాస్తి వ్యాపారంలోకి దిగి బెంగళూరులో ఆఫీస్ ప్రారంభించాడు. సొంత డబ్బుతో విదేశీ యాత్రలు, పార్టీలు ఇస్తూ ప్రముఖులకు దగ్గరై భారీగా డబ్బులు వసూలు చేశాడు. కొన్ని రోజులుగా అందుబాటులో లేకపోవడంతో బాధితులు బయటకు చెప్పలేక కుమిలిపోతున్నారు.

News December 3, 2025

ప్రెగ్నెన్సీ ఫస్ట్ ట్రైమిస్టర్‌లో ఈ జాగ్రత్తలు తీసుకోండి

image

ఆరు నుంచి 12 వారాల్లో బిడ్డ అవయవాలన్నీ ఏర్పడుతాయి. ఈ సమయంలో వైద్యుల సలహా లేకుండా ఎలాంటి మందులు వాడకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఎక్స్‌రేలకు దూరంగా ఉండాలి. ఏ సమస్య అనిపించినా వైద్యులను సంప్రదించాలి. జ్వరం వచ్చినా, స్పాంటింగ్ కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. జన్యుపరమైన సమస్యలుంటే తప్ప అబార్షన్‌ కాదు. కాబట్టి అన్ని పనులు చేసుకోవచ్చు. బరువులు ఎత్తడం, పరిగెత్తడం మానేయాలని సూచిస్తున్నారు.

News December 3, 2025

ఈ గుళ్లలో పానీపూరీనే ప్రసాదం..

image

ఏ గుడికి వెళ్లినా లడ్డూ, పులిహోరాలనే ప్రసాదాలుగా ఇస్తారు. కానీ గుజరాత్‌లోని రపుతానా(V)లో జీవికా మాతాజీ, తమిళనాడులోని పడప్పాయ్‌ దుర్గా పీఠం ఆలయాల్లో మాత్రం పిజ్జా, బర్గర్, పానీపురి, కూల్ డ్రింక్స్‌ను ప్రసాదంగా పంచుతారు. దేవతలకు కూడా వీటినే నైవేద్యంగా సమర్పిస్తారు. భక్తులు ప్రస్తుత కాలంలో ఇష్టపడే ఆహారాన్ని దేవతలకు నివేదించి, వారికి సంతోషాన్ని పంచాలనే విభిన్న సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు.