News June 28, 2024

లోపాలను సమీక్షించుకుంటాం.. కార్యకర్తలకు అండగా ఉంటాం: కాకాణి

image

AP: అధికారం ఉన్నప్పుడు ప్రజలకు న్యాయం చేశామని, ఇప్పుడు వారికి అన్యాయం జరగకుండా అడ్డుకుంటామని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. తమ హయాంలో జరిగిన లోపాలను సమీక్షించుకుంటామని, కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పారు. వైసీపీకి ఆదరణ తగ్గలేదని, ఒంటరిగానే 40% ఓట్లు వచ్చాయని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఎన్నో హామీలిచ్చిన చంద్రబాబు ఇప్పుడు పింఛన్ తప్ప మరే పథకం గురించి మాట్లాడట్లేదని విమర్శించారు.

Similar News

News December 8, 2025

విమానాల రద్దు.. ఇండిగో షేర్లు భారీగా పతనం

image

ఇండిగో(ఇంటర్‌ గ్లోబ్‌ ఏవియేషన్‌) షేర్లు ఇవాళ ట్రేడింగ్‌లో భారీగా పతనమయ్యాయి. సెషన్ ప్రారంభంలో ఏకంగా 7 శాతం నష్టపోయాయి. తర్వాత కాస్త ఎగసినా మళ్లీ డౌన్ అయ్యాయి. ప్రస్తుతం 406 పాయింట్లు కోల్పోయి(7.6 శాతం) 4,964 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. గత 5 రోజుల్లో ఏకంగా 14 శాతం మేర నష్టపోయాయి. వారం రోజులుగా ఇండిగో విమాన సర్వీసుల సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు షేర్లను అమ్మేస్తున్నారు.

News December 8, 2025

వరి పంటకు పైపాటుగా కాంప్లెక్స్ ఎరువులు వేస్తున్నారా?

image

వరి పిలకల దశలో యూరియాతో పాటు చాలా మంది రైతులు DAP, 20-20-0 వంటి కాంప్లెక్స్ ఎరువులను ఎకరాకు ఒక బస్తా చొప్పున వేస్తుంటారు. ఈ కాంప్లెక్స్ ఎరువులలో ఉండే భాస్వరం కేవలం 20 నుంచి 25 శాతమే మొక్కలకు అందుతుంది. మిగతాది అంతా భూమిలో మొక్కలకు అందని స్థితిలో మారిపోతుంది. దీనికి బదులు ‘నానో డీఏపీ’ని ఎకరాకు అర లీటరు స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

News December 8, 2025

మావోయిస్టు కీలక నేత లొంగుబాటు.. MMCలో ఉద్యమం అంతం!

image

మావోయిస్టు పార్టీ కీలక నేత రామ్‌ధేర్ మజ్జీ సహా 12 మంది ఛత్తీస్‌గఢ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. రామ్‌ధేర్ మహారాష్ట్ర-మధ్యప్రదేశ్-ఛత్తీస్‌గఢ్ (MMC) జోన్‌‌లో సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. ఇతడిపై రూ.3 కోట్ల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. రామ్‌ధేర్ లొంగుబాటుతో MMC జోన్‌లో మావోయిజం అంతమైనట్లేనని భావిస్తున్నారు.