News February 26, 2025
తమిళనాడులో చరిత్ర తిరగరాస్తాం: విజయ్

వచ్చే ఎన్నికల్లో తామే గెలుస్తామని సినీ నటుడు, టీవీకే చీఫ్ దళపతి విజయ్ ధీమా వ్యక్తం చేశారు. మహాబలిపురంలో టీవీకే పార్టీ మహానాడులో ఆయన మాట్లాడారు. 2026 ఎన్నికల్లో చరిత్ర తిరగరాస్తామని చెప్పారు. పెత్తందార్లు, భూస్వాములు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో గెలిచి సామాన్యులకు రాజ్యాధికారం కల్పిస్తామన్నారు. త్వరలోనే పార్టీలోకి కీలక నేతల చేరికలు ఉంటాయని తెలిపారు.
Similar News
News December 6, 2025
ఓరియెంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్లో భారీగా ఉద్యోగాలు

ఓరియెంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్లో 300 AO పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. పోస్టును బట్టి డిగ్రీ/PG, MA(ఇంగ్లిష్, హిందీ) ఉత్తీర్ణులైన వారు ఈ నెల 15 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 21-30ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: orientalinsurance.org.in/ * మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News December 6, 2025
APPLY NOW: ECHSలో ఉద్యోగాలు

విశాఖపట్నంలోని <
News December 6, 2025
పాక్, అఫ్గాన్ సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తతలు

పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. సరిహద్దుల్లో నిన్న రాత్రి పెద్ద ఎత్తున కాల్పులు చోటుచేసుకున్నాయి. స్పిన్ బోల్డక్ జిల్లాలో పాక్ దళాలు దాడులు ప్రారంభించాయని అఫ్గాన్ చెప్పింది. ఎలాంటి కవ్వింపు చర్యలు లేకున్నా చమన్ సరిహద్దులో అఫ్గాన్ కాల్పులు జరిపిందని పాక్ ఆరోపించింది. 2 దేశాల మధ్య శాంతి చర్చలు పురోగతి లేకుండా ముగిసిన నేపథ్యంలో ఈ ఘటనలు జరగడం గమనార్హం.


