News August 5, 2025
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను రక్షించుకుంటాం: మాధవ్

AP: కార్మికులతో కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకుంటామని బీజేపీ స్టేట్ చీఫ్ పీవీఎన్ మాధవ్ అన్నారు. విశాఖ ఉక్కును సెయిల్‌లో విలీనం చేసేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. గుంటూరు చాయ్ పే చర్చలో ఆయన మాట్లాడారు. ‘కేంద్రం ప్యాకేజీ ఇచ్చి మరీ స్టీల్ ప్లాంట్‌ను కాపాడింది. ఉత్పత్తి పెంచి లాభాల బాట పట్టిస్తాం. ఎన్డీయే పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Similar News
News August 5, 2025
సినీ కార్మికుల సమ్మెను తప్పుబట్టిన విశ్వప్రసాద్

టాలీవుడ్‌లో నెలకొన్న పరిస్థితులపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘స్కిల్ లేకుండా జీతాలు పెంచి ఇవ్వడం నిర్మాతలకు తలకు మించిన భారమే. కొన్ని క్రాఫ్ట్స్ వాళ్లు రోజుకు గంట పనిచేసినా ఫుల్ వేతనం ఇస్తున్నాం. స్కిల్స్ ఉన్నప్పటికీ యూనియన్ మెంబర్స్ కాకపోవడంతో ముంబై నుంచి అధికంగా చెల్లించి తీసుకొస్తున్నాం. ఈ సిస్టమ్ మార్చాలి. నచ్చిన వాళ్లతో పనిచేయించుకునే హక్కు మాకు ఉంది’ అని చెప్పారు.
News August 5, 2025
ఏపీలో త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు

AP: రాష్ట్రంలో త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెట్టనున్నాయి. 750 PVT ఎలక్ట్రిక్ బస్సులను అద్దె ప్రాతిపదికన RTC అందుబాటులోకి తేనుంది. AMVTI, ATP, CUD, NLR, GNT, VJW, RJY, KKD, VSP, KRNL, TPT డిపోల నుంచి ఇవి తిరగనున్నాయి. వీటికోసం కేంద్రం అందించే రూ.190కోట్లతో ఛార్జింగ్ స్టేషన్లు నెలకొల్పుతారు. ఒక్కో స్టేషన్‌కు రూ.4కోట్లు ఖర్చవుతుందని, డిసెంబర్ నాటికి వీటిని సిద్ధం చేస్తామని అధికారులు తెలిపారు.
News August 5, 2025
సోనూసూద్ సాయంపై ఫిష్ వెంకట్ కూతురు హర్షం

తమ కుటుంబానికి అండగా ఉంటానని సోనూసూద్ భరోసా ఇచ్చారని ఫిష్ వెంకట్ కుమార్తె స్రవంతి తెలిపారు. తన తండ్రి దశదిన కర్మకు రూ.1.5లక్షలు ఇచ్చారని, అందువల్లే గ్రాండ్‌గా కార్యక్రమం జరిగిందని చెప్పారు. తమ ఇంటి నిర్మాణ బాధ్యతను తాను చూసుకుంటానని సోనూసూద్ చెప్పారన్నారు. ఇటీవల చనిపోయిన ఫిష్ వెంకట్ కుటుంబాన్ని పరామర్శించిన సోనూసూద్, వెంకట్ తనకు సోదరుడిలాంటి వారని చెప్పారు. ఆ కుటుంబానికి పర్సనల్ నంబర్ ఇచ్చారు.