News June 27, 2024

ఆగస్టుకు ముందే రుణమాఫీ చేసి చూపిస్తాం: భట్టి

image

TG: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పునరుద్ఘాటించారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ ఆగస్టుకు ముందే చేసి చూపిస్తామని, దీన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. రైతు భరోసాపై విధివిధానాలు రూపొందించి, అసెంబ్లీలో చర్చించి అమలు చేస్తామని తెలిపారు. రాష్ట్రాన్ని పదేళ్లు పాలించినవారు సంపదను దోచేసి రూ.7 లక్షల కోట్ల అప్పు చేసి పారిపోయారని విమర్శించారు.

Similar News

News December 4, 2025

ప్రభుత్వ స్కూళ్లలో ‘క్లిక్కర్’ విధానం

image

AP: ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు పాఠాల రివిజన్‌కు ప్రభుత్వం ‘క్లిక్కర్’ విధానాన్ని తీసుకురానుంది. లెసన్ పూర్తయిన తర్వాత స్టూడెంట్లకు క్లిక్కర్‌ ఇస్తారు. అందులో A, B, C, D, యెస్, నో, హ్యాండ్ రైజ్ ఆప్షన్లు ఉంటాయి. క్లాస్ రూమ్‌లోని డిజిటల్ బోర్డులో ప్రశ్న డిస్‌ప్లే అవుతుంది. దానికి క్లిక్కర్ ద్వారా ఆన్సర్ ఇవ్వాలి. ఈ విధానాన్ని రేపు తొలిదశలో 53 స్కూళ్లలో CM చంద్రబాబు ప్రారంభించనున్నారు.

News December 4, 2025

విచారణ ఇంత జాప్యమా… వ్యవస్థకే సిగ్గుచేటు: SC

image

యాసిడ్ దాడి కేసుల విచారణ డేటాను సమర్పించాలని అన్ని హైకోర్టులను SC ఆదేశించింది. ఢిల్లీ కోర్టులో 16 ఏళ్ల నాటి ఓ కేసు విచారణ ఇప్పటికీ పూర్తికాకపోవడంపై CJI సూర్యకాంత్ అసంతృప్తి వ్యక్తపరుస్తూ ఇది వ్యవస్థకే సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. 2009లో యాసిడ్ దాడిలో గాయపడిన ఓ యువతి తన ఆవేదనను SCకి వినిపించారు. ముఖంపై యాసిడ్ దాడితో వైకల్యంతో పాటు దాన్ని తాగించిన ఘటనల్లో పలువురు ఆహారాన్నీ తీసుకోలేకపోతున్నారన్నారు.

News December 4, 2025

తప్పుడు కేసులు పెడితేనే నక్సలిజం పుడుతుంది: జగన్

image

AP: TDP ఆధిపత్యపోరులో జరిగిన హత్య ఘటనలో పిన్నెల్లి సోదరులను అరెస్టు చేశారని YCP చీఫ్ జగన్ మండిపడ్డారు. హతులు, హంతకులు TDP వాళ్లేనని స్వయంగా SPయే చెప్పారన్నారు. ఇవే కాకుండా అనేక మందిపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. ‘ఎక్కడైనా న్యాయం ఉందా? తప్పుడు కేసులు పెడితేనే నక్సలిజం పుడుతుంది’ అని వ్యాఖ్యానించారు. విశాఖ స్టీల్‌పై CBN గతంలో ఒకలా మాట్లాడి ఇపుడు కార్మికుల్ని బెదిరిస్తున్నారని విమర్శించారు.