News September 30, 2024

ఇసుక రవాణా ఛార్జీల సమస్యను పరిష్కరిస్తాం: మంత్రి కొల్లు

image

APలో ఇసుక సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. అక్టోబర్ 15 నుంచి పూర్తి స్థాయిలో ఇసుక అందుబాటులో ఉంటుందన్నారు. వర్షాకాలంలో వరదల దృష్ట్యా ఇసుక తవ్వకూడదనే NGT నిబంధనల ప్రకారం రీచుల్ని నిలిపివేశామని చెప్పారు. ఇకపై బోట్ మెన్ సొసైటీలు, పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలు చేపడతామన్నారు. దూర ప్రాంతాలకు రవాణా ఛార్జీలు ఎక్కువ అవుతున్నాయనే సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.

Similar News

News September 30, 2024

DSC అభ్యర్థులకు BIG ALERT

image

TG: DSCలో అర్హత సాధించిన అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ అక్టోబర్ 1 నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 5వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇది కొనసాగనుంది. 1:3 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపడతారు. మెరిట్ ఆధారంగా అభ్యర్థులకు ఫోన్‌లో సమాచారం అందిస్తారు. ఎంపికైన వారి జాబితాను DEOలు ప్రకటిస్తారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు సెట్ల ఫొటో కాపీలతో హాజరుకావాలి.

News September 30, 2024

కొండా సురేఖకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నా: హరీశ్

image

TG: మహిళలను గౌరవించడం అందరి బాధ్యత అని హరీశ్ రావు గుర్తుచేశారు. ‘మహిళల పట్ల అగౌరవంగా ప్రవర్తించడాన్ని ఏ ఒక్కరూ సహించరు. ఈ విషయంలో BRS పార్టీ అయినా, వ్యక్తిగతంగా నేనైనా ఉపేక్షించబోము. కొండా సురేఖకు కలిగిన <<14234406>>అసౌకర్యానికి <<>>చింతిస్తున్నా. సోషల్ మీడియాలో ఇలాంటి వికృత చేష్టలను తీవ్రంగా ఖండిస్తున్నా. అందరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరుతున్నా’ అని హరీశ్ ట్వీట్ చేశారు.

News September 30, 2024

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

ఏపీలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, VZM, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ జిల్లాల్లో మోస్తరు వర్షాలు, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, NTR, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, ATP, శ్రీ సత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడతాయంది.