News September 30, 2024

బుల్డోజర్లకు అడ్డుగా నిలబడతాం: KTR

image

TG: ‘హైడ్రా’ పేరుతో ప్రభుత్వం అమాయక ప్రజల ఇళ్లు కూలుస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. ‘ఎవరి కమీషన్ల కోసం మూసీ సుందరీకరణ అంటున్నారు. పేదల ఇళ్లు కూలుస్తుంటే మేం చూస్తూ ఊరుకోం. బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది. నాతో సహా మా నేతలంతా బుల్డోజర్లకు అడ్డుగా నిలబడతాం. కూల్చాల్సి వస్తే మొదట హైడ్రా కమిషన్ కార్యాలయం, బుద్ధభవన్‌ను కూల్చాలి’ అని కేటీఆర్ మండిపడ్డారు.

Similar News

News September 30, 2024

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు ఊరట

image

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు కర్ణాటక హైకోర్టు ఊరటనిచ్చింది. ఆమెపై నమోదైన ఎలక్టోరల్ బాండ్స్ కేసులో విచారణపై స్టే విధించింది. ఈ కేసులో ఫిర్యాదుదారునిపై ఎలాంటి బెదిరింపులకు పాల్పడలేదని గమనించామని, అలాగే కేసుని దోపిడీకి సంబంధించిన అంశంగా పరిగణించట్లేదని పేర్కొంది. తదుపరి విచారణను అక్టోబర్ 22కి వాయిదా వేసింది. అప్పటివరకు ఇన్వెస్టిగేషన్‌పై స్టే విధించింది.

News September 30, 2024

ALERT.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్

image

☞ ICICI డెబిట్ కార్డుతో గత త్రైమాసికంలో రూ.10000 వాడితే ప్రస్తుత త్రైమాసికంలో 2 కాంప్లిమెంటరీ ఎయిర్‌పోర్టు లాంజ్ యాక్సెస్‌లు పొందవచ్చు
☞ HDFC క్రెడిట్ కార్డుతో ఒక త్రైమాసికంలో ఒక యాపిల్ ఉత్పత్తిపైనే రివార్డు రిడీమ్ చేసుకోవచ్చు
☞ పన్ను రిటర్నుల్లో ఇకపై ఆధార్ నంబర్ మాత్రమే వాడాలి
☞ F&O ట్రేడింగ్‌లో ఆప్షన్ కాంట్రాక్టును విక్రయిస్తే ప్రీమియంపై STTని 0.1%, ఫ్యూచర్స్ విభాగంలో STT 0.02% చెల్లించాలి.

News September 30, 2024

ఇసుక రవాణా ఛార్జీల సమస్యను పరిష్కరిస్తాం: మంత్రి కొల్లు

image

APలో ఇసుక సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. అక్టోబర్ 15 నుంచి పూర్తి స్థాయిలో ఇసుక అందుబాటులో ఉంటుందన్నారు. వర్షాకాలంలో వరదల దృష్ట్యా ఇసుక తవ్వకూడదనే NGT నిబంధనల ప్రకారం రీచుల్ని నిలిపివేశామని చెప్పారు. ఇకపై బోట్ మెన్ సొసైటీలు, పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలు చేపడతామన్నారు. దూర ప్రాంతాలకు రవాణా ఛార్జీలు ఎక్కువ అవుతున్నాయనే సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.