News April 3, 2024
తైవాన్ ప్రజలకు అండగా ఉంటాం: మోదీ

తైవాన్ భూకంపంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన ఆయన.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ విషాద సమయంలో తైవాన్ ప్రజలకు అండగా ఉంటామని మోదీ స్పష్టం చేశారు. కాగా తైవాన్‌లో సంభవించిన భారీ భూకంపంతో ఇప్పటివరకు 9 మంది మరణించారు. వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు.
Similar News
News April 21, 2025
IPL: టాస్ గెలిచిన కేకేఆర్

ఈడెన్ గార్డెన్స్‌లో KKRvsGT మ్యాచ్‌లో కేకేఆర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పాయింట్స్ టేబుల్లో గుజరాత్(5 విజయాలు) అగ్రస్థానంలో ఉండగా కోల్‌కతా(3 విజయాలు) ఏడో స్థానంలో ఉంది.
జట్లు:
GT: గిల్, సుదర్శన్, బట్లర్, రూధర్‌ఫోర్డ్, షారుఖ్, తెవాటియా, రషీద్, సుందర్, కిశోర్, సిరాజ్, ప్రసిద్ధ్
KKR: గుర్బాజ్, నరైన్, రహానే, వెంకటేశ్, రింకూ, రస్సెల్, రమణ్‌దీప్, అలీ, వైభవ్, హర్షిత్, వరుణ్
News April 21, 2025
‘హైదరాబాద్‌కు రండి’.. జపాన్ కంపెనీలకు సీఎం ఆహ్వానం

TG: భారత మార్కెట్‌తో పాటు ప్రపంచ దేశాలు తెలంగాణను గమ్యస్థానంగా ఎంచుకోవాలని వ్యాపార, పారిశ్రామికవేత్తలను సీఎం రేవంత్ ఆహ్వానించారు. జపాన్‌లోని ఒసాకాలో జరిగిన వరల్డ్ ఎక్స్పో 2025లో ఆయన పాల్గొన్నారు. ఈ సదస్సులో భారత్ నుంచి పాల్గొన్న మొదటి రాష్ట్రం తెలంగాణ అని, ఇది గర్వకారణమని తెలిపారు. అంతర్జాతీయ ఎగుమతుల కోసం సమీప ఓడరేవుతో అనుసంధానించే డ్రై పోర్టును తెలంగాణలో ఏర్పాటు చేస్తామన్నారు.
News April 21, 2025
సిట్ పోలీసుల అదుపులో రాజ్ కసిరెడ్డి

AP: మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డిని ఏపీ సిట్ పోలీసులు శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. ఆయన గోవా నుంచి హైదరాబాద్ వచ్చినట్లు సమాచారం. కాసేపట్లో విజయవాడకు తరలించనున్నారు. కాగా ఇవాళ సిట్ విచారణకు హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నట్లు రాజ్ కసిరెడ్డి ఈ ఉదయం ఆడియో రిలీజ్ చేశారు.