News November 6, 2024

అక్రమ వలసలు అడ్డుకుంటాం: ట్రంప్

image

తన గెలుపుతో అమెరికాకు మేలు జరుగుతుందని రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ‘స్వింగ్ రాష్ట్రాల్లో నేను ఊహించిన దాని కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. పాపులర్ ఓట్లలోనూ మనదే ఆధిక్యం. మనకు 315 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తా. ఎవరైనా దేశంలోకి చట్టబద్ధంగా వచ్చేలా చట్టాలు తయారు చేస్తా. సరిహద్దులను నిర్ణయిస్తా. అక్రమ వలసలు అడ్డుకుంటా’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Similar News

News November 6, 2024

ముగ్గురు US ప్రెసిడెంట్లతో మోదీ సావాసం

image

అమెరికా తదుపరి అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక లాంఛనమైపోవడంతో ఆయనకు భారతీయులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా 2014 నుంచి ముగ్గురు అధ్యక్షులు మారినా మోదీ మాత్రం భారత ప్రధానిగానే ఉన్నారని గుర్తుచేస్తున్నారు. 2014-17 వరకు ఒబామా, 2017-21 వరకు ట్రంప్, 2021- 24 వరకు బైడెన్, మళ్లీ ఇప్పుడు ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మూడు పర్యాయాలుగా మోదీ వీరితో సావాసం చేస్తున్నారు.

News November 6, 2024

ఢిల్లీకి బయల్దేరిన పవన్ కళ్యాణ్

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గన్నవరం నుంచి ఢిల్లీకి బయల్దేరారు. ఇవాళ సాయంత్రం ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు. శాంతి భద్రతల అంశంపై షాతో ఆయన చర్చించనున్నట్లు తెలుస్తోంది. సమావేశం తర్వాత తిరిగి ఏపీకి పయనం కానున్నారు.

News November 6, 2024

చావును దాటి వైట్‌హౌస్‌పై జెండా ఎగరేసి..

image

US ఎన్నికల్లో విజయానికి ముందు డొనాల్డ్ ట్రంప్ అష్టకష్టాలు పడ్డారు. కోర్టుల్లో చాలా కేసులు ఎదుర్కొన్నారు. ఒకానొక దశలో ఎన్నికల్లో అసలు పోటీచేయకుండా కుట్రలు జరిగాయి. ఫెడరల్ కోర్టు దానిని కొట్టేసి మార్గం సుగమం చేసింది. ఆ తర్వాత పెన్సిల్వేనియా కాల్పుల్లో వెంట్రుకవాసిలో బుల్లెట్ నుంచి తప్పించుకున్నారు. మరోసారి గోల్ఫ్ కోర్ట్ వద్ద కాల్పులు జరిగాయి. చివరికి అన్నీ దాటుకొని వైట్‌హౌస్‌లో అడుగు పెడుతున్నారు.