News October 27, 2024
మా పౌరులను వదిలేస్తే యుద్ధం ఆపేస్తాం: ఇజ్రాయెల్

బందీలుగా పట్టుకున్న తమ పౌరులను హమాస్ వదిలేస్తే తాము యుద్ధం ఆపేయడానికి సిద్ధమని భారత్‌లో ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ స్పష్టం చేశారు. గాజాలో స్థిరత్వానికి తాము కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు. ‘కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ ఎప్పుడూ సిద్ధమే. కానీ ముందుగా హమాస్ ఆయుధాలను పక్కన పెట్టాలి. బందీలను వదిలేయాలి. భద్రతామండలి తీర్మానాల్ని గాజాలో అమలు చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’ అని తెలిపారు.
Similar News
News October 22, 2025
ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత.. సీఎం సంతకం

TG: స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రూల్‌ను తొలగించే పంచాయతీరాజ్ చట్ట సవరణ ఫైల్‌పై సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేశారు. గురువారం మంత్రివర్గ ఆమోదం తర్వాత ఈ ఫైల్ గవర్నర్ వద్దకు వెళ్లనుంది. ఆయన సంతకం తర్వాత ఆర్డినెన్స్ జారీ చేస్తారు. దాని ప్రకారం వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఎంత మంది పిల్లలు ఉన్నా పోటీ చేయవచ్చు.
News October 22, 2025
మీ విషెస్‌కు థాంక్స్ ట్రంప్: మోదీ

దీపావళి సందర్భంగా విష్ చేసిన US అధ్యక్షుడు ట్రంప్‌కు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. ‘మీ ఫోన్ కాల్‌కు థాంక్స్. ఈ పండుగ నాడు మన రెండు ప్రజాస్వామ్య దేశాలు ప్రపంచాన్ని ప్రకాశింపజేయడాన్ని కొనసాగించాలి. టెర్రరిజానికి వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడాలి’ అని పేర్కొన్నారు. కాగా 2 దేశాల మధ్య వాణిజ్యం గురించి <<18068579>>మోదీతో మాట్లాడినట్లు<<>> ట్రంప్ తెలిపారు. వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.
News October 22, 2025
విష్ణు వామనావతారం ఎందుకు ఎత్తాడు?

దానశీలి బలి చక్రవర్తి అపారమైన యాగబలంతో ఇంద్ర పదవిని ఆక్రమించి 3 లోకాలపై ఆధిపత్యాన్ని సాధించాడు. ఇది లోకాల సమతుల్యతను దెబ్బతీయడంతో పాటు దేవతల్లో ఆందోళన పెంచింది. అందుకే విష్ణువు, బలి దానగుణాన్ని గౌరవిస్తూనే, అతని అహంకారాన్ని అణచడానికి, లోకాలను రక్షించడానికి వామనుడి రూపంలో వచ్చాడు. కేవలం మూడడుగుల నేల అడిగి, బలిని పాతాళానికి పంపాడు. సద్గుణాలకు మెచ్చి ఆ లోకానికి రాజుగా చేసి, ధర్మాన్ని నిలబెట్టాడు.