News October 26, 2024
ప్రాణ త్యాగం చేసైనా వక్ఫ్ బిల్లును అడ్డుకుంటాం: మౌలానా ఖలీద్

వక్ఫ్ సవరణ బిల్లును అడ్డుకోవడానికి ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు ప్రాణ త్యాగానికైనా సిద్ధమే అని బోర్డు అధ్యక్షుడు మౌలానా ఖలీద్ సైఫుల్లా అన్నారు. ‘ఇది మాకు జీవన్మరణ సమస్య. ప్రతిపాదిత సవరణ బిల్లు అమలును అడ్డుకొని తీరుతాం. అవసరమైతే ముస్లింలు జైల్ భరో కార్యక్రమాలు చేపడతారు’ అని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వమే అత్యధికంగా వక్ఫ్ ఆస్తులను ఆక్రమించిందని మౌలానా ఆరోపించారు.
Similar News
News November 28, 2025
2,757 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) 2,757 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఏ, బీకామ్, బీఎస్సీ, డిప్లొమా, టెన్త్, ఐటీఐ, ఇంటర్ అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి డిసెంబర్ 18 వరకు NAPS/NATS పోర్టల్‌లో అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 24ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://iocl.com
News November 28, 2025
వరల్డ్‌లోనే ఎత్తైన శ్రీరాముడి విగ్రహం.. నేడు ప్రారంభించనున్న మోదీ

ద.గోవాలోని శ్రీసంస్థాన్ గోకర్ణ పార్తగాలి జీవోత్తమ మఠంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 77అడుగుల శ్రీరాముడి కంచు విగ్రహాన్ని PM మోదీ నేడు సాయంత్రం ఆవిష్కరించనున్నారు. ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ రూపకర్త రామ్ సుతార్ తల్పోణ నదీ తీరంలో దీన్ని రూపొందించారు. మఠం స్థాపించి 550ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గోవా గవర్నర్ అశోక్ గాజపతిరాజు, CM ప్రమోద్ సావంత్ విగ్రహ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.
News November 28, 2025
పశువులకు మూతిపుండ్ల వ్యాధి ముప్పు!

AP: ఇటీవల కురిసిన వర్షాల వల్ల పాడి పశువులు మూతి పుండ్ల వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని.. పశుపోషకులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ సంచాలకులు దామోదర్‌నాయుడు సూచించారు. ఈ వ్యాధి సోకిన పశువుల్లో తీవ్రమైన జ్వరం, నాలుక నీలి రంగులోకి మారడం, నోటి చిగుళ్లపై పొక్కులు ఏర్పడటం, దాణా తీసుకోకపోవడం, నోటి నుంచి చొంగ కారడం, నీరసం, పాల ఉత్పత్తి తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.


