News January 1, 2025
సూపర్-6 హామీలను కచ్చితంగా అమలు చేస్తాం: CM

AP: YS జగన్ సీపీఎస్ రద్దు, మద్యనిషేధం అమలు చేస్తామని అబద్ధాలు చెప్పారని సీఎం చంద్రబాబు విమర్శించారు. ఎంత మంది ఉన్నా అమ్మఒడి ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదని, తాము మాత్రం కచ్చితంగా సూపర్-6 హామీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. త్వరలో పోలవరం పనులు ప్రారంభించి అనుకున్న సమయానికి పూర్తి చేస్తామన్నారు. తానెప్పుడూ రాజకీయ కక్షలు తీర్చుకోనని, తప్పు చేసిన వారిని మాత్రం వదలబోనని చిట్చాట్లో హెచ్చరించారు.
Similar News
News November 22, 2025
వంటింటి చిట్కాలు

– చపాతీ పిండి మిగిలిపోతే దానిపై కొద్దిగా నెయ్యి లేదా నూనె వేసి, గాలి వెళ్లని డబ్బాలో పెట్టి ఫ్రిజ్లో ఉంచాలి.
– ఫ్రిజ్లో అక్కడక్కడ కొద్దిగా పుదీనా ఆకులు ఉంచితే దుర్వాసన రాదు.
– కూరల్లో కారం ఎక్కువైతే అందులో టేబుల్ స్పూన్ నిమ్మరసం లేదా నెయ్యి వేస్తే కారం తగ్గుతుంది.
– కాఫీ టేస్టీగా రావాలంటే డికాషన్లో చిటికెడు ఉప్పు వేయాలి.
– ఆపిల్ పండ్ల పక్కనే పెడితే అరటి పండ్లు త్వరగా పండుతాయి.
News November 22, 2025
వనజీవి జీవితంపై సినిమా మొదలు!

తెలంగాణ ‘వనజీవి’గా పేరుగాంచిన పద్మశ్రీ అవార్డు గ్రహీత రామయ్య జీవిత చరిత్ర సినిమా రూపంలో తెరకెక్కనుంది. ఖమ్మంలో ఈ బయోపిక్ను లాంఛనంగా ప్రారంభించారు. వనజీవి రామయ్య తన జీవితాన్ని లక్షలాది మొక్కలను నాటడానికి, రక్షించడానికి అంకితం చేసిన విషయం తెలిసిందే. ఆయన ఆదర్శవంతమైన, నిరాడంబర జీవన విధానం, పర్యావరణ భక్తిని ఈ సినిమా వెండితెరపైకి తీసుకురానుంది. ఆయన పాత్రలో నటుడు బ్రహ్మాజీ కనిపించనున్నారు.
News November 22, 2025
క్షమాపణలు చెప్పిన అల్-ఫలాహ్ వర్సిటీ

ఢిల్లీ పేలుడు ఘటనలో అల్-ఫలాహ్ వర్సిటీ పేరు రావడంతో, వారి వెబ్సైట్లో ఉన్న పాత అక్రిడిటేషన్ వివరాలపై NAAC షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై వర్సిటీ స్పందిస్తూ వెబ్సైట్ డిజైన్ లోపాలు కారణంగా ఈ పొరపాట్లు జరిగాయని క్షమాపణలు తెలిపింది. తప్పుడు సమాచారాన్ని తొలగించినట్లు పేర్కొంది. కాగా గడువు ముగిసిన తరువాత కూడా వర్సిటీ గ్రేడ్లను తమ సైట్లో కొనసాగిస్తూ వచ్చింది.


