News June 13, 2024
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అధ్యయనం చేస్తాం: మంత్రి పయ్యావుల
AP: సీఎం చంద్రబాబు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. మంత్రి పదవి తన బాధ్యతను మరింత పెంచిందన్నారు. ‘సమాజానికి మేం ఏం చేయగలమనే ఆలోచనతో మా ప్రస్థానం మొదలైంది. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అధ్యయనం చేస్తాం. సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయనే అంశాలను పరిశీలిస్తాం. మేము చేసే అభివృద్ధిపై బ్లూ ప్రింట్ విడుదల చేస్తాం’ అని పేర్కొన్నారు.
Similar News
News December 24, 2024
అశ్విన్ స్థానంలో అన్‌క్యాప్డ్ ప్లేయర్
ఆస్ట్రేలియాతో మిగతా రెండు టెస్టులకు అశ్విన్ స్థానంలో యువ క్రికెటర్, అన్‌క్యాప్డ్ ప్లేయర్ తనుష్ కోఠియన్‌ను BCCI అనూహ్యంగా ఎంపిక చేసింది. బాక్సింగ్ డే టెస్టుకు ముందు ఆయన జట్టులో చేరనున్నట్లు తెలిపింది. ఈ ముంబై ఆల్‌రౌండర్ 33 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 101 వికెట్లు తీశారు. బ్యాటింగ్‌లో 1,521 పరుగులు చేశారు. వీటిలో రెండు సెంచరీలు ఉన్నాయి.
News December 24, 2024
ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి
AP: సకాలంలో పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్థులకు మంత్రి లోకేశ్ గుడ్ న్యూస్ చెప్పారు. విద్యార్థుల అభ్యర్థన మేరకు తత్కాల్ పథకాన్ని ప్రవేశపెట్టారు. నిర్ణీత రుసుముతో ఈ నెల 31 వరకు ఫీజు చెల్లించే అవకాశాన్ని కల్పించినట్లు పేర్కొన్నారు. పలు కారణాలతో చెల్లించని అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
News December 24, 2024
భూమి గుండ్రంగా లేదని నిరూపించేందుకు రూ.31 లక్షలు ఖర్చు!
భూమి గుండ్రంగా ఉందనే విషయాన్ని ఎవరిని అడిగినా చెబుతారు. అయితే, ఇది అబద్ధం అంటూ ఓ యూట్యూబర్ సవాల్ విసిరాడు. భూమి ఫ్లాట్‌గా ఉందని నిరూపించేందుకు యూట్యూబర్ జెరన్ కాంపనెల్లా ఏకంగా రూ.31 లక్షలు ఖర్చు చేసి అంటార్కిటికాలో యాత్ర ప్రారంభించాడు. ఈ ట్రిప్ పూర్తయ్యేలోపు తన వాదన తప్పనే విషయాన్ని గ్రహించాడు. భూమి గుండ్రంగానే ఉందంటూ క్షమాపణలు చెప్పాడు.