News October 9, 2025
కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా ఆదుకుంటాం: లోకేశ్

AP: TDP కార్యకర్తలంతా తన కుటుంబ సభ్యులని, వారికి ఏ కష్టమొచ్చినా ఆదుకోవడం తన బాధ్యత అని మంత్రి నారా లోకేశ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అనుచరుల దాడిలో గాయపడి, అస్వస్థతతో ఇటీవల మరణించిన శేషగిరిరావు కుటుంబ సభ్యులను ఉండవల్లికి రప్పించి మాట్లాడారు. ఈవీఎం ధ్వంసం ఘటనలో ఆయన గట్టిగా పోరాడారని, స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. ఇలాగే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని అన్నారు.
Similar News
News October 9, 2025
కాంగ్రెస్ క్యాడర్‌లో నిరాశ!

TG: BCలకు 42% రిజర్వేషన్లు ఇస్తున్నామంటూ INC ఇన్నాళ్లూ ప్రచారం చేసింది. దీనిపైనే స్థానిక ఎన్నికలకు వెళ్తున్నామని ప్రకటించింది. నోటిఫికేషన్ రావడంతో గెలుపే లక్ష్యంగా క్యాడరూ సన్నద్ధమైంది. తీరా రిజర్వేషన్లతో పాటు నోటిఫికేషన్‌పై HC స్టే ఇవ్వడంతో క్యాడర్‌ను ఒక్కసారిగా నిరాశ ఆవహించింది. ప్రత్యర్థి నాయకులకు ఎలా కౌంటర్ ఇవ్వాలో తెలియని పరిస్థితి నెలకొంది. అధిష్ఠానం వారిలో ఎలాంటి ధైర్యం నింపుతుందో చూడాలి.
News October 9, 2025
సునామీలో మిస్సింగ్.. 14 ఏళ్లుగా వెతుకుతున్న భర్త!

ఎంతో ఇష్టమైన భార్యను కోల్పోయి 14 ఏళ్లు అవుతున్నా జపాన్‌కు చెందిన భర్త యసువో టకమాట్సు ఆమె జాడ కోసం సముద్రంలో జల్లెడ పడుతున్నారు. 2011 సునామీలో కొట్టుకుపోయే ముందు భార్య యుకో ‘నాకు ఇంటికి వెళ్లాలని ఉంది’ అని చెప్పారు. ఆ మాట యసువోను 14 ఏళ్లుగా వెంటాడుతోంది. ఆమె మాటలను గౌరవించి స్కూబా డైవింగ్ నేర్చుకొని ఓనగావా సముద్రంలో వెతుకుతున్నారు. తిరిగి రాదని తెలిసినా వెతికే ప్రయత్నాన్ని ఆపట్లేదు.
News October 9, 2025
791 పోస్టుల స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలు విడుదల

AP: అటవీశాఖలో ఫారెస్టు బీట్ ఆఫీసర్, అసిస్టెంటు బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన స్క్రీనింగ్ టెస్టు ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. సెప్టెంబర్ 7న ఈ పరీక్షలు నిర్వహించారు. మెయిన్స్‌కు FSOకు 2,346, FBO, ABOలకు 13,845 మంది అర్హత సాధించినట్లు కమిషన్ పేర్కొంది. FSOలో 100, FBO, ABOల్లో 691 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఫలితాల కోసం ఇక్కడ <