News January 4, 2025

మాల్దీవుల ప్రగతికి అండగా ఉంటాం: జైశంకర్

image

మాల్దీవుల ప్రగతికి, సుస్థిరతకు భారత్ ఎప్పుడూ అండగా ఉంటుందని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. మాల్దీవుల విదేశాంగ మంత్రి అబ్దుల్లా ఖలీల్‌ న్యూఢిల్లీ పర్యటన సందర్భంగా ఢిల్లీలో జరిగిన భేటీ అనంతరం ఆయన పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ నేపథ్యంలో పొరుగు దేశాలతో సత్సంబంధాలను కొనసాగిస్తామని జైశంకర్ పేర్కొన్నారు. అటు.. భారత్‌తో బంధం బలోపేతానికి కట్టుబడి ఉన్నట్లు ఖలీల్ ట్వీట్ చేశారు.

Similar News

News December 17, 2025

జనవరి 1న ‘భారత్ టాక్సీ’ ప్రారంభం

image

ప్రయాణికులకు, డ్రైవర్లకు భారీ ఊరట కలిగించేలా కేంద్ర ప్రభుత్వం ‘భారత్ టాక్సీ’ యాప్‌ను జనవరి 1 నుంచి ప్రారంభించనుంది. ఉబర్, ఓలా వంటి ప్రైవేట్ క్యాబ్ సర్వీసులకు దీటుగా దీనిని తీసుకొస్తోంది. తొలుత ఢిల్లీలో ప్రయోగాత్మకంగా ప్రారంభించి తరువాత దేశవ్యాప్తంగా విస్తరించనుంది. ప్రైవేట్ క్యాబ్ సర్వీసుల తరహాలో ఇందులో అధిక ఛార్జీలు ఉండవు. ఇప్పటికే 56 వేల మందికిపైగా డ్రైవర్లు రిజిస్టర్‌ చేసుకున్నట్లు సమాచారం.

News December 17, 2025

కొండెక్కిన వెండి ధరలు

image

వెండి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇవాళ ఒక్కరోజే కేజీపై ఏకంగా రూ.11వేలు పెరిగింది. దీంతో ఓవరాల్ రేట్ రూ.2,22,000కు చేరింది. అటు బంగారం ధరలు కూడా మళ్లీ పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.650 పెరిగి రూ.1,34,510గా నమోదైంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.600 పెరిగి రూ.1,23,300కు చేరింది.

News December 17, 2025

RBI 93 పోస్టులకు షార్ట్ నోటిఫికేషన్

image

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) 93 పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు జనవరి 6వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, పీహెచ్‌డీ, సీఏ, CMA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://rbi.org.in/