News March 11, 2025

ఆడబిడ్డలను మోసగిస్తే తాటతీస్తాం: చంద్రబాబు

image

AP: హత్యా రాజకీయాల మరక అంటకుండా 42 ఏళ్లుగా రాజకీయాలు చేస్తున్నానని CM చంద్రబాబు తెలిపారు. నేరాలు – ఘోరాలు చేసి రాజకీయాలు చేస్తామంటే కుదరదని హెచ్చరించారు. కొందరు ఆడబిడ్డలను మాయమాటలతో మోసగిస్తున్నారని, వారి తాటతీస్తామని హెచ్చరించారు. ఆకతాయిలు వేధిస్తుంటే ‘శక్తి’ యాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే పోలీసులు వెంటనే చర్యలు తీసుకుంటారన్నారు. వైసీపీ తీసుకొచ్చిన దిశ యాప్ దిక్కుమాలిన యాప్‌ అని మండిపడ్డారు.

Similar News

News November 22, 2025

పాక్‌ ప్లాన్‌ను తిప్పికొట్టిన భారత్-అఫ్గాన్

image

ఇండియా, అఫ్గాన్ మధ్య దౌత్యమే కాకుండా వాణిజ్య సంబంధాలు కూడా బలపడుతున్న విషయం తెలిసిందే. దీనిని తట్టుకోలేని పాకిస్థాన్ వారి రోడ్డు మార్గాన్ని వాడుకోకుండా అఫ్గాన్‌కు ఆంక్షలు విధించింది. పాక్ ఎత్తుగడకు భారత్ చెక్ పెట్టింది. అఫ్గాన్ నుంచి సరుకు రవాణాకు ప్రత్యామ్నాయంగా జల, వాయు మార్గాలను ఎంచుకుంది. ఇరాన్ చాబహార్ పోర్టు నుంచి జల రవాణా, కాబుల్ నుంచి ఢిల్లీ, అమృత్‌సర్‌కు కార్గో రూట్లను ప్రారంభించింది.

News November 22, 2025

వెహికల్ చెకింగ్‌లో ఈ పత్రాలు తప్పనిసరి!

image

పోలీసులు వాహనాల తనిఖీ సమయంలో ఏయే పత్రాలను చెక్ చేస్తారో చాలా మందికి తెలిసుండదు. చెకింగ్ సమయంలో మీ వద్ద డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్‌తో పాటు పొల్యూషన్ సర్టిఫికెట్ కూడా ఉండేలా చూసుకోండి. కమర్షియల్ వాహనమైతే పైన పేర్కొన్న వాటితో పాటు పర్మిట్ & ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఉండాలి. తెలుగు రాష్ట్రాల వాహనదారులు mParivahan లేదా DigiLocker యాప్‌లలో డిజిటల్ రూపంలో ఉన్న పత్రాలను చూపించవచ్చు. SHARE IT

News November 22, 2025

దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహించాలి: KTR

image

TG: ఈనెల 29న ‘దీక్షా దివస్’ను ఘనంగా నిర్వహించాలని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పిలుపునిచ్చారు. “15 ఏళ్ల క్రితం, పార్టీ అధినేత KCRగారు ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అని దీక్ష చేపట్టి రాష్ట్రాన్ని సాధించుకున్నారు. జిల్లా కేంద్రాల్లోని పార్టీ ఆఫీసుల్లోనే దీక్షా దివస్‌ను నిర్వహించుకోవాలి. కార్యక్రమం ప్రారంభానికి గుర్తుగా KCR భారీ కటౌట్‌కు పాలాభిషేకం చేయాలి” అని పార్టీ నేతలకు నిర్దేశం చేశారు.