News April 1, 2025

వక్ఫ్ సవరణ బిల్లును ఏకగ్రీవంగా వ్యతిరేకిస్తాం: KC వేణుగోపాల్

image

I.N.D.I అలయెన్స్ పార్టీలన్నీ కలిసి వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంటులో ఏకగ్రీవంగా వ్యతిరేకిస్తాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. ‘వక్ఫ్ సవరణ బిల్లుపై మేం తొలినుంచీ వ్యతిరేక వైఖరితోనే ఉన్నాం. ఈ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకం. కచ్చితంగా వ్యతిరేకిస్తాం. మా కూటమి పార్టీలన్నీ ఈ విషయంలో ఏకాభిప్రాయంతో ఉన్నాయి. ఇతర పార్టీలు కూడా మాతో కలిసిరావాలని కోరుతున్నాం’ అని పేర్కొన్నారు.

Similar News

News April 3, 2025

ఏప్రిల్ 3: చరిత్రలో ఈరోజు

image

1955: ప్రముఖ నేపథ్య గాయకుడు హరిహరన్ జననం
1962: నటి జయప్రద జననం
1973: నటుడు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా జననం
1964: భారత మాజీ క్రికెటర్ అజయ్ శర్మ జననం
1680: మహారాష్ట్ర సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మరణం
1973: కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు ప్రభుదేవా జననం
1973: భారత మాజీ క్రికెటర్ నీలేష్ కులకర్ణి జననం

News April 3, 2025

జైస్వాల్ ముంబైని వీడటానికి కారణం అదేనా?

image

యువ క్రికెటర్ జైస్వాల్ <<15967764>>ముంబైని వీడి గోవా జట్టులో<<>> చేరనున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ముంబై టీమ్‌తో ఆయనకు ఏర్పడిన విభేదాలే దీనికి కారణమని తెలుస్తోంది. క్రికెట్ వర్గాల ప్రకారం.. ముంబై-విదర్భ మధ్య జరిగిన రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచ్‌కి జైస్వాల్ మోకాలి నొప్పి పేరిట దూరమయ్యారు. ఆ మ్యాచ్‌లో ముంబై ఓడింది. దాంతో అసోసియేషన్ పెద్దలకు, జైస్వాల్‌కు మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం.

News April 3, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

error: Content is protected !!