News April 22, 2025
అధిష్ఠానం చెప్పినవారికే ఓటేస్తాం: పొన్నం

TG: రేపు హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కార్పొరేటర్ల ఇళ్ల ఎదుట బ్యానర్లు కట్టి, బ్లాక్‌మెయిల్ చేయడమేంటని మండిపడ్డారు. బీజేపీకి ఓటు వేయకపోతే హిందువులు కారా? అని ప్రశ్నించారు. రెచ్చగొట్టే పనులు చేస్తున్నా EC మౌనంగా ఉందన్నారు. అధిష్ఠానం చెప్పినవారికి తమ నేతలు ఓటేస్తారన్నారు. కాగా ఈ ఎన్నికలో బీజేపీ, ఎంఐఎం అభ్యర్థులే బరిలో ఉన్నారు.
Similar News
News November 18, 2025
పాలేరు డ్యామ్ భద్రతపై నిపుణుల బృందం సమీక్ష

డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అశోకు మార్ గంజు ఆధ్వర్యంలో నిపుణుల బృందం పాలేరు జలాశయాన్ని పరిశీలించింది. వారు ఆనకట్ట భద్రత కోసం తీసుకోవాల్సిన తక్షణ చర్యలు, శాశ్వత మరమ్మతులపై అధికారులతో చర్చించి సూచనలు చేశారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని చైర్మన్ తెలిపారు. ఈ పర్యటనలో ఎస్ఈ సారంగం, ఈఈ రమేష్ రెడ్డి సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.

ఇతిహాసాలు క్విజ్ – 70

ఈరోజు ప్రశ్న: హనుమంతుడిని ‘మారుతీ’ అని ఎందుకు పిలుస్తారు?
☛ పై ప్రశ్నకు సమాధానాన్ని సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు జవాబు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>