News November 9, 2024
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 100 సీట్లు గెలుస్తాం: హరీశ్ రావు
తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 100 సీట్లు గెలుస్తామని BRS నేత హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో రైతులు, విద్యార్థులు, పోలీసులు.. ఇలా అన్ని వర్గాల వారు రోడ్లెక్కుతున్నారని విమర్శించారు. 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. మంత్రులు గాలి మోటార్లు ఎక్కి గాల్లో తిరుగుతున్నారని, భూమిపై తిరిగితే ప్రజల కష్టాలు తెలుస్తాయని సంగారెడ్డి రైతు దీక్షలో అన్నారు.
Similar News
News December 27, 2024
భారత్‌పై స్మిత్ రికార్డు
టీమ్ ఇండియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో స్టీవ్ స్మిత్ సెంచరీ చేశారు. 167 బంతుల్లో శతకం చేశారు. ఈ సిరీస్‌లో ఆయనకిది రెండో సెంచరీ. మొత్తంగా భారత్‌పై 11వది. దీంతో టీమ్ ఇండియాపై టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా చరిత్రకెక్కారు. టెస్టుల్లో 34 సెంచరీల మార్కును అందుకున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోర్ 394/6గా ఉంది.
News December 27, 2024
మన్మోహన్ అరుదైన ఫొటోలు.. గ్యాలరీ
మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్(92) తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన జ్ఞాపకాలను నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. మన్మోహన్ అరుదైన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
News December 27, 2024
10 ఏళ్లు ప్రధాని.. రెండు ఫ్లాట్లు, మారుతి 800 కారు
తనకు రూ.15.77 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని మన్మోహన్ సింగ్ 2018లో రాజ్యసభ సీటుకు నామినేషన్ సందర్భంగా వెల్లడించారు. ఢిల్లీ, చండీగఢ్‌లో రెండు ఫ్లాట్లు, మారుతి 800 కారు, SBI, పోస్టల్ బ్యాంకులో డిపాజిట్లు ఉన్నాయని అఫిడవిట్ సమర్పించారు. ఎలాంటి అప్పులు లేవని పేర్కొనడం మన్మోహన్ ఆర్థిక క్రమశిక్షణకు నిదర్శనం.