News July 14, 2024

ఇండియా మా దేశానికి రాకపోతే T20WC-26 నుంచి వైదొలుగుతాం: PCB

image

వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీని పూర్తిగా తమ దేశంలోనే నిర్వహించాలని PCB నిర్ణయించుకుంది. ఈ టోర్నీ కోసం పాకిస్థాన్‌కు టీమ్ ఇండియా రాకపోతే.. 2026లో భారత్- శ్రీలంక నిర్వహించే T20WC నుంచి వైదొలగాలని భావిస్తోంది. ఈ నెల 19 నుంచి 22 వరకు కొలంబోలో జరిగే ICC వార్షిక సదస్సులో హైబ్రిడ్ మోడల్ ప్రతిపాదనలను వ్యతిరేకించనున్నట్లు సమాచారం. పాక్‌లో పర్యటించబోమని BCCI వర్గాలు చెబుతున్న విషయం తెలిసిందే.

Similar News

News December 1, 2025

అనంతపురంలో రోడ్డెక్కిన అరటి రైతులు

image

అనంతపురం కలెక్టరేట్ వద్ద అరటి రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. నష్టపోయిన అరటి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అరటి రైతులు రోడ్డెక్కి ఆర్తనాదాలు చేస్తుంటే కూటమి ప్రభుత్వంలోని నాయకులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. తక్షణమే అరటి రైతులను ఆదుకోకపోతే కూటమి ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని శైలజానాథ్ హెచ్చరించారు.

News December 1, 2025

దిత్వా ఎఫెక్ట్.. వరి కోత యంత్రాలకు పెరిగిన డిమాండ్

image

తెలుగు రాష్ట్రాల్లో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ తరుణంలో దిత్వా తుఫాన్ రావడంతో.. వరి పండిస్తున్న రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తుఫానుకు తమ పంట ఎక్కడ దెబ్బతింటుందో అని చాలా మంది రైతులు వరి కోత సమయం రాకముందే కోసేస్తున్నారు. దీంతో వరి కోత యంత్రాలకు డిమాండ్ పెరిగింది. ఇదే అదనుగా కోత యంత్రాల యజమానులు.. ఎకరా పంట కోయడానికి రూ.4వేలకు పైగా వసూలు చేస్తున్నట్లు రైతులు వాపోతున్నారు.

News December 1, 2025

నేవీ అధికారి భార్యను రైలు నుంచి తోసేసిన TTE!

image

యూపీలో నేవీ అధికారి భార్య మృతి కేసులో రైల్వే టీటీఈపై కేసు నమోదైంది. నవంబర్ 26న వైద్యం కోసం ఢిల్లీకి బయలుదేరిన ఆర్తి(30) పొరపాటున మరో ట్రైన్ ఎక్కారు. టికెట్ విషయమై ఆర్తికి TTEతో వివాదం తలెత్తగా లగేజ్‌తో పాటు ఆమెను బయటకు తోసేశాడని కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే చనిపోయిందన్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో ఘటనపై ప్రత్యక్ష సాక్షులను విచారిస్తున్నట్లు GRP అధికారులు తెలిపారు.