News October 9, 2024
రోహిత్ వల్లే గెలిచాం.. గంభీర్‌ను పొగడటం ఆపండి: గవాస్కర్

బంగ్లాదేశ్‌తో ఇటీవల జరిగిన టెస్టు సిరీస్‌లో రెండో మ్యాచ్‌ను భారత్ అద్భుత రీతిలో గెలిచిన సంగతి తెలిసిందే. దానిపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం రోహిత్ కెప్టెన్సీ వల్లే ఆ గెలుపు సాధ్యమైందని తేల్చిచెప్పారు. కొంతమంది ఆ క్రెడిట్‌ను గంభీర్‌కు కట్టబెట్టి అతడి బూట్లు నాకుతున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. క్రికెట్ వర్గాల్లో ఆయన మాటలు చర్చనీయాంశంగా మారాయి.
Similar News
News November 2, 2025
గుడ్‌న్యూస్.. జెప్టోలో ఆ ఛార్జీలు ఉండవు!

క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ జెప్టో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్డర్లపై హ్యాండ్లింగ్ ఫీజులు, సర్జ్, రెయిన్ ఛార్జీలు ఉండవని ప్రకటించింది. ఇకపై ₹99 కంటే ఎక్కువున్న ఆర్డర్లను ఉచితంగా డెలివరీ చేయనుంది. ‘10 నిమిషాల డెలివరీ’ మార్కెట్లో బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ నుంచి గట్టి పోటీ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ₹99 కంటే తక్కువ ఉన్న ఆర్డర్లపై మాత్రం ₹30 డెలివరీ ఫీజు వసూలు చేయనుంది.
News November 2, 2025
నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, మేడ్చల్, సిద్దిపేట, కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, యాదాద్రి, నల్గొండలో వర్షాలకు ఛాన్స్ ఉందని తెలిపారు. HYDలో సాయంత్రం నుంచి వాన పడే అవకాశం ఉన్నట్లు చెప్పారు. మిగతా జిల్లాల్లోనూ చెదురుమదురు జల్లులు పడే ఆస్కారమున్నట్లు వివరించారు.
News November 2, 2025
రైల్‌టెల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

<


