News January 25, 2025

ఇందిరమ్మ పేరు పెడితే ఒక్క ఇల్లు కూడా ఇవ్వం: బండి

image

TG: ఇందిరమ్మ ఇళ్లపై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పథకానికి ఇందిరమ్మ పేరు పెడితే కేంద్రం ఒక్క ఇల్లు కూడా ఇవ్వదని తేల్చిచెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు పెడితేనే నిధులిస్తామన్నారు. అలాగే కాంగ్రెస్ ఫొటోలు పెడితే రేషన్ కార్డులు ఇవ్వబోమని, తామే ముద్రించి ప్రజలకు కార్డులు జారీ చేస్తామని స్పష్టంచేశారు. కాగా రాష్ట్రానికి 20లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని CM రేవంత్ కోరారు.

Similar News

News November 22, 2025

ADB: ఢీకొట్టాల్సిన వేళ.. డీలాగా..!

image

డీసీసీ అధ్యక్షుల నియామకంపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. హైకమాండ్ నిర్ణయం వాయిదా పడటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. జిల్లాల వారీగా పేర్లను ఖరారు చేసినప్పటికీ, చివరి ఆమోదం కోసం వేచిచూస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆలస్యం కారణంగా జిల్లాలో కార్యకలాపాలు మందగిస్తున్నాయని నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎన్నికల వేళ సారథి లేకపోతే అభ్యర్థులు గెలిచేదెలా అనే చర్చ మొదలైంది.

News November 22, 2025

వంటింటి చిట్కాలు

image

– చపాతీ పిండి మిగిలిపోతే దానిపై కొద్దిగా నెయ్యి లేదా నూనె వేసి, గాలి వెళ్లని డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి.
– ఫ్రిజ్‌లో అక్కడక్కడ కొద్దిగా పుదీనా ఆకులు ఉంచితే దుర్వాసన రాదు.
– కూరల్లో కారం ఎక్కువైతే అందులో టేబుల్ స్పూన్ నిమ్మరసం లేదా నెయ్యి వేస్తే కారం తగ్గుతుంది.
– కాఫీ టేస్టీగా రావాలంటే డికాషన్‌‌‌లో చిటికెడు ఉప్పు వేయాలి.
– ఆపిల్ పండ్ల పక్కనే పెడితే అరటి పండ్లు త్వరగా పండుతాయి.

News November 22, 2025

వనజీవి జీవితంపై సినిమా మొదలు!

image

తెలంగాణ ‘వనజీవి’గా పేరుగాంచిన పద్మశ్రీ అవార్డు గ్రహీత రామయ్య జీవిత చరిత్ర సినిమా రూపంలో తెరకెక్కనుంది. ఖమ్మంలో ఈ బయోపిక్‌ను లాంఛనంగా ప్రారంభించారు. వనజీవి రామయ్య తన జీవితాన్ని లక్షలాది మొక్కలను నాటడానికి, రక్షించడానికి అంకితం చేసిన విషయం తెలిసిందే. ఆయన ఆదర్శవంతమైన, నిరాడంబర జీవన విధానం, పర్యావరణ భక్తిని ఈ సినిమా వెండితెరపైకి తీసుకురానుంది. ఆయన పాత్రలో నటుడు బ్రహ్మాజీ కనిపించనున్నారు.