News July 21, 2024
పూరీ రహస్య గదిలో ఆయుధాలు

పూరీ జగన్నాథుడి ఆలయంలోని రహస్య గదిలో వెలకట్టలేని సంపదతో పాటు ఆయుధాలు కూడా ఉన్నాయట. భాండాగార అధ్యయన సంఘం అధ్యక్షుడు జస్టిస్ బిశ్వనాథ్ రథ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘సంపద వివరాలను బయటికి చెప్పకూడదని నిర్ణయించాం. అభరణాలతో పాటు రహస్య గదిలో ఆయుధాలూ ఉన్నాయి. ఆభరణాలతో పాటే వాటిని ఖజానాలో సీల్ చేయించాం’ అని తెలిపారు. భాండాగారం మరమ్మతుకు ఎంత టైమ్ పడుతుందో తెలీదని ఆయన స్పష్టం చేశారు.
Similar News
News November 25, 2025
ఇతిహాసాలు క్విజ్ – 77 సమాధానాలు

ప్రశ్న: ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి బొటన వేలిని గురుదక్షిణగా ఇవ్వమని ఎందుకు అడిగాడు?
జవాబు: ఏకలవ్యుడు మొరుగుతున్న కుక్క నోటిని బాణాలతో కుట్టి, దాన్ని మొరగకుండా చేశాడు. ఈ విలువిద్యను చూసిన ద్రోణుడు అతనికి అస్త్రాలను దుర్వినియోగం చేస్తాడని, విచక్షణా రహితంగా వాడే అవకాశముందని విలువిద్యకు కీలకమైన బొటనవేలుని గురుదక్షిణగా అడిగాడు. అలాగే అర్జునుడికి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 25, 2025
బ్రెస్ట్ నుంచి స్రావాలు వస్తున్నాయా?

రొమ్ములనుంచి ఎలాంటి స్రావాలు వచ్చినా క్యాన్సర్ అని చాలామంది భావిస్తారు. అయితే ఇదీ ఒక క్యాన్సర్ లక్షణమే కానీ, అన్నిసార్లూ అదే కారణం కాదంటున్నారు నిపుణులు. గెలాక్టోరియా వల్ల కూడా ఇలా జరగొచ్చంటున్నారు. ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువగా విడుదల కావడం, హైపోథైరాయిడిజమ్, కణితులు, లోదుస్తులు బిగుతుగా ఉండటం వల్ల కూడా రొమ్ముల్లో నీరు రావచ్చు. కాబట్టి వెంటనే వైద్యులను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి.
News November 25, 2025
టాటా కొత్త SUV.. ధర రూ.11.49 లక్షలు

టాటా మోటార్స్ తన ఐకానిక్ మోడల్ <<18299496>>సియారా<<>>ను మళ్లీ మార్కెట్లోకి తెచ్చింది. ఈ SUV ధర రూ.11.49 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. డిసెంబర్ 16 నుంచి బుకింగ్స్ స్టార్ట్ అవుతాయని, వచ్చే జనవరి 15 నుంచి డెలివరీలు షురూ చేస్తామని ఆ కంపెనీ ప్రకటించింది. పెట్రోల్, డీజిల్ ఆప్షన్లు ఉంటాయి. కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా, గ్రాండ్ విటారా కార్లతో ఇది పోటీ పడనుంది.


