News March 15, 2025
Weather Report: బాబోయ్ ఎండలు.(జాగ్రత్త)

జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. గత 10రోజులుగా పోల్చుకుంటే 3.3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదుతున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సుమారుగా 42డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఎండ తీవ్రతతో పాటు వడగాలు కూడా అధికంగా ఉండే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే వారు జాగ్రత్తగా ఉండాలని నిపుణలు సూచిస్తున్నారు.
Similar News
News April 18, 2025
చైనాతో మంచి డీల్ చేసుకుంటాం: ట్రంప్

వాణిజ్యంపై త్వరలోనే చైనాతో మంచి ఒప్పందం చేసుకుంటామని US అధ్యక్షుడు ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే యూరప్‌తోపాటు ఇతర దేశాలతో డీల్ చేసుకోవడంలో కొంత సమస్య ఉందన్నారు. ఇటాలియన్ ప్రధానమంత్రి వైట్ హౌస్ పర్యటన సందర్భంగా ట్రంప్ మాట్లాడారు. కాగా అమెరికా-చైనా మధ్య ప్రస్తుతం ట్రేడ్ వార్ నడుస్తోంది. డ్రాగన్ వస్తువులపై US ఏకంగా 245శాతం పన్ను విధించిన సంగతి తెలిసిందే.
News April 18, 2025
నితీశ్ ఈసారి అంతంతమాత్రమే..!

IPL: గత సీజన్లో రాణించి వెలుగులోకి వచ్చిన తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి ఈసారి తీవ్రంగా నిరాశపరుస్తున్నారు. ఈ సీజన్‌లో 7 మ్యాచుల్లో 6 సార్లు బ్యాటింగ్ చేసిన నితీశ్ కేవలం 131 పరుగులే చేశారు. ఆ ఇన్నింగ్స్ ఇలా ఉన్నాయి.. 30(15), 32(28), 0(2), 19(15), 31(34), 19(21). ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. స్ట్రైక్ రేట్ కూడా ఆకట్టుకునేలా లేదని, ఆయన బ్యాటింగ్ మెరుగుపర్చుకోవాల్సి ఉందని నెటిజన్లు అంటున్నారు.
News April 18, 2025
వరల్డ్ ప్రెస్ ఫొటో ఆఫ్ ది ఇయర్‌గా యుద్ధ బాధితుడి చిత్రం

గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలో గాయపడిన ఓ బాలుడి చిత్రం ఈ ఏడాది వరల్డ్ ప్రెస్ ఫొటో ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైంది. పాలస్తీనాకు చెందిన ఫొటోగ్రాఫర్ సమర్ అబు ఎలూఫ్ ఈ ఫొటో తీశారు. ఈ చిత్రంలోని బాలుడు రెండు చేతులు కోల్పోయి దీనస్థితిలో కనిపిస్తున్నాడు. ఈ యుద్ధం వల్ల భవిష్యత్తు తరాలు ఎలా అంధకారంలోకి వెళ్లాయో ఈ చిత్రం చెబుతుందని వరల్డ్ ప్రెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తెలిపారు.