News March 15, 2025
Weather Report: బాబోయ్ ఎండలు.(జాగ్రత్త)

జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. గత 10రోజులుగా పోల్చుకుంటే 3.3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదుతున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సుమారుగా 42డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఎండ తీవ్రతతో పాటు వడగాలు కూడా అధికంగా ఉండే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే వారు జాగ్రత్తగా ఉండాలని నిపుణలు సూచిస్తున్నారు.
Similar News
News March 16, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News March 16, 2025
ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సహకరించండి: కలెక్టర్

స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెలా 3 వ శనివారం నెలకొక థీమ్ చొప్పున పరిశుభ్రత కార్యక్రమాలు చేపడుతున్నామని కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. ఈ నెల ‘సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం’ అనే థీమ్‌పై ప్రజల్లో అవగాహన కల్పించామన్నారు. ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని పిలుపునిచ్చామని పేర్కొన్నారు. నంద్యాలలోని చిన్నచెరువు దగ్గర స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు.
News March 16, 2025
కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించిన కలెక్టర్

కొమురవెల్లి మండలం గురువన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష ద్వారా ఏర్పాటు చేసిన ఎఐ (ఆర్టిఫిషల్ ఇంటిలీజెన్స్) కంప్యూటర్ ల్యాబ్‌ను జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2002లో ప్రారంభించిన FLN(ఫౌండేషన్ లిటరసీ న్యూమారసి) ప్రోగ్రాం ద్వారా పాఠశాల విద్యార్థుల గణిత, తెలుగు అభ్యసన సామర్ధ్యం పెంచేందుకు కృషి జరుగుతుందన్నారు.