News September 27, 2024

MBBS కన్వీనర్ కోటా ప్రవేశాలకు వెబ్ ఆప్షన్లు

image

TG: రాష్ట్రంలో MBBS ప్రవేశాల కోసం వెబ్‌ఆప్షన్ ప్రక్రియ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ ప్రకటించింది. ఈ రోజు ఉ.6గంటల నుంచి ఈ నెల 29వ తేదీ సా.6గంటలకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఉంటుంది. కన్వీనర్ కోటా కింద దివ్యాంగులు, EWS, PMC, సైనిక ఉద్యోగుల పిల్లలు దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్ల కోసం tspvtmedadm.tsche.inను సందర్శించాలి.

Similar News

News December 2, 2025

టెన్త్ పరీక్షలు ఎప్పుడంటే?

image

TG: టెన్త్ పరీక్షలు 2026 మార్చి 16న నిర్వహించేందుకు SSC బోర్డు సిద్ధమైంది. మార్చి 13తో ఇంటర్ ఎగ్జామ్స్ ముగియనున్న నేపథ్యంలో వెంటనే వీటిని నిర్వహించేలా అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. మరోవైపు విద్యార్థులపై ఒత్తిడి పడకుండా ఒక్కో పేపర్‌కు మధ్య 1-2 రోజులు గ్యాప్ ఉండేలా ప్లాన్ చేశారు. ఒకవేళ MAR 16న పరీక్షలు మొదలైతే ఏప్రిల్ మొదటి వారంలో ముగియనున్నాయి. ఒకటి రెండు రోజుల్లో షెడ్యూల్ రానుంది.

News December 2, 2025

ప్రాణాలతో ఉండాలంటే దేశం నుంచి వెళ్లిపో: ట్రంప్

image

పదవి నుంచి దిగిపోయి, దేశం విడిచి వెళ్లిపోవాలని వెనిజుల అధ్యక్షుడు నికోలస్ మదురోకు US అధ్యక్షుడు ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. అలా చేస్తే ఆయన్ను, సన్నిహితులను ప్రాణాలతో వదిలేస్తామని చెప్పారు. ఫోన్ సంభాషణ సందర్భంగా ట్రంప్ హెచ్చరించారని ‘మియామి హెరాల్డ్’ చెప్పింది. ఈ ప్రతిపాదనకు ఆయన ఒప్పుకోలేదని తెలిపింది. ‘సార్వభౌమాధికారం, స్వేచ్ఛతో కూడిన శాంతి కావాలి. బానిస శాంతి కాదు’ అని మదురో చెప్పడం గమనార్హం.

News December 2, 2025

సుడిదోమ, పచ్చదోమ కట్టడికి లైట్ ట్రాప్స్

image

కొన్ని రకాల పురుగులు పంటలకు రాత్రి పూట కూడా హాని చేస్తుంటాయి. ఇలాంటి కీటకాలు రాత్రివేళ లైట్ కాంతికి బాగా ఆకర్షించబడతాయి. ఇలాంటి కీటకాలను ఆకర్షించి అంతచేసేవే ‘లైట్ ట్రాప్స్’. ముఖ్యంగా వరిలో సుడిదోమ, పచ్చదోమ నివారణకు ఈ లైట్ ట్రాప్స్ బాగా పనిచేస్తాయి. లైట్‌తో పాటు ఒక టబ్‌లో నీటిని పోసి దానిలో రసాయన మందును కలిపితే పురుగులు లైట్‌కి ఆకర్షించబడి మందు కలిపిన నీళ్లలో పడి చనిపోతాయి.