News October 23, 2024
బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలకు వెబ్ ఆప్షన్ల నమోదు ప్రారంభం

AP: బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో కన్వీనర్ కోటా ప్రవేశాలకు వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 25వ తేదీ రాత్రి 9గంటల్లోగా విద్యార్థులు ఆప్షన్లు నమోదు చేసుకోవాలని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ తెలిపింది. ఆప్షన్ల నమోదులో సాంకేతిక సమస్యలు తలెత్తితే 9000780707, 8008250842 నంబర్లను సంప్రదించాలని రిజిస్ట్రార్ రాధికారెడ్డి తెలిపారు.
Similar News
News December 12, 2025
బొగ్గు పొయ్యిలపై తందూరీ వద్దు!

ఢిల్లీలో వాయు కాలుష్య నివారణకు బొగ్గు పొయ్యిలపై తందూరీ తయారీని నిషేధించారు. హోటల్స్, దాబాలు, స్ట్రీట్ ఫుడ్ సెంటర్లలో కట్టెల పొయ్యిలనూ వాడొద్దని ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ ఆదేశించింది. రూల్స్ అతిక్రమిస్తే భారీగా ఫైన్ వేస్తామని హెచ్చరించింది. ఢిల్లీలోని లజపత్నగర్, కరోల్బాగ్, సుభాష్ నగర్ తందూరీ, టిక్కాలకు ఫేమస్. తాజా ఆదేశాలతో అక్కడ బొగ్గుల స్థానంలో గ్యాస్, ఎలక్ట్రిక్ పొయ్యిలు వాడుతున్నారు.
News December 12, 2025
కొండంత లక్ష్యం.. నంబర్-3లో అక్షర్ పటేలా?

SA 2వ T20లో 214 పరుగుల భారీ లక్ష్యం ముందు ఉంచితే, IND జట్టు ఫాలో అయిన స్ట్రాటజీ వింతగా ఉందని క్రీడా వర్గాలు విమర్శిస్తున్నాయి. గిల్ తొలి ఓవర్లోనే ఔటైతే SKYకి బదులు అక్షర్ నం.3లో రావడమేంటని ప్రశ్నిస్తున్నాయి. సూర్య కాకపోయినా తిలక్, హార్దిక్, జితేశ్ ఉండగా ఈ మూవ్ ఏంటో అంతుచిక్కడం లేదని అభిప్రాయపడుతున్నాయి. తొలి బంతి నుంచే తడబడిన అక్షర్ 21బంతుల్లో 21పరుగులే చేసి వెనుదిరిగారు. దీనిపై మీ COMMENT.
News December 12, 2025
వరి నాట్లు వేసేటప్పుడు జాగ్రత్తలు(1/2)

వరి నారుమడి నుంచి నారు తీసే వారం రోజుల ముందు.. ఎకరానికి సరిపడా నారుమడికి కిలో కార్బోఫ్యూరాన్ 3జి గుళికలు వేసి నీరు పెట్టి ఇంకించాలి. దీని వల్ల పొలంలో నెలవరకూ పైరును పురుగులు ఆశించవు. వరి రకాల పంట కాలాన్ని బట్టి 22-28 రోజుల వయసుగల నారును నాట్లు వేసుకోవాలి. నారుమడి నుంచి పెరికిన నారు కట్టలను నానో DAP ద్రావణంలో(లీటరు నీటికి 4ml) 15 నిమిషాలు ముంచి నాటితే పొలంలో పైరు తొందరగా వేర్లు తొడిగి నాటుకుంటాయి.


