News March 2, 2025

ఏపీ రాజకీయాలపై వెబ్ సిరీస్.. చంద్రబాబు పాత్రలో నటించేది ఎవరంటే?

image

సామాజిక అంశాలను కథా వస్తువులుగా తెరకెక్కించే దర్శకుడు దేవ కట్టా ఓ వెబ్ సిరీస్ తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం YSR, సీఎం చంద్రబాబు స్నేహం గురించి ఈ కథ ఉంటుందని సమాచారం. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కే ఈ సిరీస్‌లో చంద్రబాబు పాత్రలో ఆది పినిశెట్టి, వైఎస్ఆర్ రోల్‌లో చైతన్య రావు నటిస్తారని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Similar News

News March 3, 2025

ట్రంప్‌తో భేటీకి సిద్ధం: జెలెన్‌స్కీ

image

అమెరికాతో ఉన్న బంధాన్ని తాను కాపాడుకోగలనని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ధీమా వ్యక్తం చేశారు. గత వారం ఖనిజాల ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఏకాభిప్రాయం కుదరకపోవడంపై స్పందించారు. ట్రంప్ ఆహ్వానిస్తే మరోసారి భేటీకి వెళ్తానని పేర్కొన్నారు. తీవ్రమైన, నిజమైన సమస్యలను పరిష్కరించుకోవడానికి తాను సిద్ధమేనని వెల్లడించారు.

News March 3, 2025

దేవర-2లో రణ్‌వీర్ సింగ్?

image

జూ.ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సూపర్ హిట్ కావడంతో పార్ట్-2పై డైరెక్టర్ కొరటాల శివ కసరత్తు చేస్తున్నారు. ముందు అనుకున్న కథలో చాలా మార్పులు చేసి కొత్త స్క్రిప్ట్, స్క్రీన్ ప్లేపై ఫోకస్ చేసినట్లు సమాచారం. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ కోసం ఓ ప్రత్యేక పాత్రను డిజైన్ చేసినట్లు టాక్. త్వరలోనే ఆయనకు కథను వినిపిస్తారని తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో లేదా 2026 జనవరిలో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

News March 3, 2025

6 MLC స్థానాలకు కౌంటింగ్ ప్రారంభం

image

తెలుగు రాష్ట్రాల్లో 6 MLC స్థానాలకు కౌంటింగ్ ప్రారంభమైంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేశారు. APలో ఉమ్మడి గుంటూరు-కృష్ణా, ఉ.గోదావరి జిల్లాల పట్టభద్రులు, ఉత్తరాంధ్రలో ఉపాధ్యాయ, TGలో MDK-NZB-ADB-KNR గ్రాడ్యుయేట్, టీచర్, ఉమ్మడి WGL-KMM-NLGలో టీచర్ MLC స్థానానికి పోలింగ్ జరిగింది. కాగా టీచర్ స్థానాలకు ఇవాళ సాయంత్రం. పట్టభద్రుల MLCలకు రెండు రోజుల వరకు కౌంటింగ్ కొనసాగనుంది.

error: Content is protected !!