News January 31, 2025
నేటి నుంచి మోగనున్న పెళ్లిబాజాలు

మాఘమాసం ఆరంభం కావడంతో ఇవాళ్టి నుంచి వివాహ వేడుకలు ప్రారంభం కానున్నాయి. శుభ ముహూర్తంలో మూడు ముళ్ల బంధంతో వేలాది జంటలు ఒక్కటి కానున్నాయి. ఈ నెల 31, ఫిబ్రవరి 2, 7, 13, 14, 16, 20, 22, 23, మార్చి 2, 6, 7, 12, 14, 15, 16, ఏప్రిల్ 9, 10, 11, 12, 13, 16, 18, 20, 23, 29, 30, మే 1, 7, 8, 9, 10, 11, 14, 15, 16, 17, 18, 21, 22, 23, 28 తేదీల్లో కళ్యాణ ఘడియలు ఉన్నట్లు పండితులు తెలిపారు.
Similar News
News November 15, 2025
iBOMMA నిర్వాహకుడికి 14 రోజుల రిమాండ్

TG: దేశవ్యాప్తంగా సినిమాలు, ఓటీటీ కంటెంట్ను పైరసీ చేస్తోన్న <<18297457>>iBOMMA<<>> నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. వాదనలు విన్న న్యాయమూర్తి నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో అతడిని చంచల్గూడ జైలుకు తరలించారు. కూకట్పల్లిలోని ఓ ఫ్లాట్లో ఉండగా రవిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పైరసీల ద్వారా అతను రూ.కోట్లు సంపాదించాడనే ఆరోపణలున్నాయి.
News November 15, 2025
దేశమంతా గర్వంగా ఫీలవుతుంది: మహేశ్ బాబు

వారణాసి సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని మహేశ్ బాబు తెలిపారు. ‘ఈ సినిమా కోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడతాను. అందరూ గర్వపడేలా చేస్తాను. ముఖ్యంగా రాజమౌళిని. ఇది విడుదలైన తరవాత దేశమంతా గర్వంగా ఫీలవుతుంది’ అని అన్నారు. ‘పౌరాణికం చేయమని నాన్న అడుగుతుండేవారు. ఆయన మాటలు ఎప్పుడూ వినలేదు. ఇప్పుడు ఆయన నా మాటలు వింటుంటారు’ అని గ్లోబ్ట్రాటర్ ఈవెంట్లో మాట్లాడారు.
News November 15, 2025
యక్ష ప్రశ్నలు, సమాధానాలు – 5

24. ఎల్లప్పుడూ వేగం గలదేది? (జ.నది)
25. రైతుకు ఏది ముఖ్యం? (జ.వాన)
26. బాటసారికి, రోగికి, గృహస్థునకు, చనిపోయిన వారికి బంధువులెవరు? (జ.సార్ధం, వైద్యుడు, శీలవతి అనుకూలవతి అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు)
27. ధర్మానికి ఆధారమేది? (జ.దయ)
28. కీర్తికి ఆశ్రయమేది? (జ.దానం)
29. దేవలోకానికి దారి ఏది? (జ.సత్యం)
<<-se>>#YakshaPrashnalu<<>>


