News February 7, 2025
ఇవాళ రాత్రికి అంతర్వేదిలో కళ్యాణోత్సవం
AP: అంబేడ్కర్ కోనసీమ(D) సఖినేటిపల్లి(మ) అంతర్వేదిలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం ఇవాళ జరగనుంది. అర్ధరాత్రి 12.55 గంటలకు మృగశిరా నక్షత్రయుక్త వృశ్చిక లగ్నంలో శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో అర్చకులు కళ్యాణం జరిపించనున్నారు. దాదాపు 2-3 లక్షల మంది భక్తులు ఈ వేడుక కోసం తరలిరానున్నారు. ఆర్టీసీ దాదాపుగా 105 బస్సులు తిప్పుతుండగా, 1600 మంది సిబ్బందితో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
Similar News
News February 7, 2025
ఆదాయం ప్రకటించిన ఎల్ఐసీ
LIC ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.11,506 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతంతో పోలిస్తే 17 శాతం పెరిగినట్లు పేర్కొంది. ప్రీమియంల ద్వారా రూ.1,06,891 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ త్రైమాసికంలో మెుత్తంగా సంస్థ ఆదాయం రూ.2,01,994 కోట్లు కాగా గతంతో పోలిస్తే రూ.10,453 కోట్లు తగ్గినట్లు ప్రకటించింది. ఈ నష్టాలతోLIC షేరు 2.15శాతం తగ్గి రూ.811 వద్ద ముగిసింది.
News February 7, 2025
గ్రేట్.. ఆరు నెలల బోనస్ ఇచ్చిన స్టార్టప్
ఉద్యోగుల విధేయతను గౌరవిస్తూ ఓ కంపెనీ వారికి 6 నెలల జీతాన్ని బోనస్‌గా ఇచ్చింది. TNలోని కోయంబత్తూరులో ఉన్న AI స్టార్టప్ ‘KOVAI.CO’ను శరవణ కుమార్ స్థాపించారు. మొత్తం 140 మంది ఉద్యోగులుండగా, వారికి రూ.14 కోట్లు బోనస్‌గా ఇచ్చారు. ‘స్టార్టప్‌లలో పనిచేసేందుకు ఎవరూ మొగ్గుచూపారు. మూడేళ్లు మాతో పనిచేస్తే 2025 జనవరి జీతంలో ఆరు నెలల బోనస్ ఇస్తానని ప్రకటించి ఆ మాటను నిలబెట్టుకున్నా’ అని శరవణ కుమార్ తెలిపారు.
News February 7, 2025
ఆ రెండ్రోజులు బ్యాంకులు బంద్?
మార్చి 24, 25 తేదీల్లో దేశ వ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు ఆందోళనకు దిగనుండటంతో బ్యాంక్ సేవలకు అంతరాయం కలిగే ఛాన్సుంది. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలోని 9 యూనియన్లు సమ్మెకు పిలుపునిచ్చాయి. వారానికి 2 రోజుల సెలవులు, కొత్త జాబ్స్, DFS రివ్యూను తొలగించడం, కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయడం, రూ.25 లక్షల గ్రాట్యుటీ వరకు IT మినహాయింపు డిమాండ్లను నెరవేర్చాలని ఉద్యోగులు కోరుతున్నారు.