News February 22, 2025
పంట పొలంలో పెళ్లి.. వైరల్

భారీ ఫంక్షన్ హాల్, డెకరేషన్, డీజే చప్పుళ్ల మధ్య పెళ్లిళ్లు జరుగుతున్న ఈ రోజుల్లో పంజాబ్‌కు చెందిన ఓ జంట వినూత్నంగా ఆలోచించింది. తమ గ్రామంలోని పంట పొలం మధ్య వివాహం చేసుకుని దుర్లభ్ సింగ్, హర్మన్‌కౌర్ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఢిల్లీ సరిహద్దుల్లో పంజాబ్ రైతులు చేసిన పోరాట నినాదాలను ముద్రించిన స్వీట్ బాక్సులను అతిథులకు అందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి.
Similar News
News October 18, 2025
APPLY NOW: NTPCలో ఉద్యోగాలు…

NTPC లిమిటెడ్‌లో 10 డిప్యూటీ మేనేజర్ పోస్టులకు అప్లై చేయడానికి ఈనెల 21 ఆఖరు తేదీ. బీఈ/బీటెక్ ఉత్తీర్ణులై, న్యూక్లియర్ ఫీల్డ్‌లో పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, PwBD, మహిళలు ఫీజు చెల్లించనవసరం లేదు. రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://careers.ntpc.co.in/
News October 18, 2025
కోతుల బెడద.. గ్రామస్థులు ఏం చేశారంటే..

TG: యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ మండలం కూరెళ్లలో కోతుల బెడద విపరీతంగా పెరిగింది. అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో సమస్యను తామే పరిష్కరించుకునేందుకు గ్రామస్థులు సిద్ధమయ్యారు. కరీంనగర్ నుంచి కోతులను బంధించే బృందాన్ని రప్పించాలని, ఒక్కో కోతిని పట్టుకునేందుకు రూ.300 చెల్లించాలని గ్రామస్థులు సమావేశమై నిర్ణయించారు. ప్రతి ఇంటి నుంచి రూ.1,000 చొప్పున ఇచ్చేందుకు ప్రజలు అంగీకరించారు.
News October 18, 2025
జైనుల దీపావళి ఎలా ఉంటుందంటే..?

జైనులు దీపావళిని ఆధ్యాత్మిక దినంగా పరిగణిస్తారు. ఈరోజునే మహావీరుడు నిర్యాణం పొందిన రోజుగా భావిస్తారు. ఆయన దివ్యజ్యోతికి ప్రతీకగా దీపాలను వెలిగిస్తారు. ఆ కాంతిని మహావీరునికి అంకితం చేస్తారు. ఆయన జ్ఞాన బోధనలను, చూపిన మోక్షమార్గాన్ని స్మరించుకుంటారు. దీపావళిని వారు అంత పవిత్రంగా భావిస్తారు కాబట్టే.. వ్యాపారాలను ఈ శుభదినం నుంచి ప్రారంభిస్తే సత్ఫలితాలు ఉంటాయని నమ్ముతారు. నూతన సంవత్సరంగా జరుపుకొంటారు.