News June 1, 2024
మళ్లీ పెళ్లి ముహూర్తాలు.. తేదీలు ఇవే!

మూఢం, శూన్యమాసం కారణంగా కొద్ది రోజులుగా వివాహాలు జరగట్లేదు. జూన్, జులైలో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. జూన్ 29, జులై 11, 12, 13, 14, 15 తేదీల్లో మంచి రోజులు ఉన్నాయన్నారు. ఆ తర్వాత చతుర్మాసం కారణంగా ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు శుభ ముహూర్తాలు లేవని, మళ్లీ నవంబర్, డిసెంబర్ నెలల్లో ఉన్నాయని పురోహితులు వివరించారు.
Similar News
News August 11, 2025
9th క్లాస్ విద్యార్థులకు ‘ఓపెన్ బుక్’ పరీక్షలు

9వ తరగతి విద్యార్థులకు ఓపెన్ బుక్ విధానంలో పరీక్షలు నిర్వహించాలని సీబీఎస్‌ఈ నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనుంది. ఇందులో భాగంగా లాంగ్వేజ్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ పరీక్షలను స్టూడెంట్స్ బుక్స్ చూస్తూ రాయొచ్చు. అయితే స్కూళ్లు దీన్ని అమలుచేయడం తప్పనిసరి కాదని బోర్డు తెలిపింది. మరోవైపు స్టూడెంట్స్, టీచర్స్, పేరెంట్స్ కోసం ప్రత్యేకంగా కమ్యూనిటీ రేడియో స్టేషన్‌ను ఏర్పాటు చేయనుంది.
News August 11, 2025
‘ఆడుదాం ఆంధ్ర’పై నేడు ప్రభుత్వానికి నివేదిక

AP: ‘ఆడుదాం ఆంధ్ర’ నిర్వహణలో అవినీతి జరిగిందన్న ఫిర్యాదులపై విజిలెన్స్ అధికారులు విచారణ ముగించారు. ఇవాళ 30 పేజీల నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నారు. కిట్ల కొనుగోలు, పోటీల నిర్వహణలో రూ.40కోట్ల మేర అవినీతి జరిగిందని ఆరోపణలున్నాయి. విచారణలో నిధుల దుర్వినియోగం జరిగిందని తేల్చినట్లు సమాచారం. మాజీమంత్రి రోజా, శాప్ మాజీ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు కనిపిస్తోంది.
News August 11, 2025
మరో US శాటిలైట్‌ను లాంచ్ చేయనున్న ఇస్రో

USకు చెందిన భారీ కమ్యూనికేషన్ శాటిలైట్‌ను 2 నెలల్లో లాంచ్ చేయనున్నట్లు ఇస్రో ఛైర్మన్ వి.నారాయణన్ తెలిపారు. 6,500KGs బరువుండే బ్లాక్-2 బ్లూబర్డ్ శాటిలైట్ వచ్చే నెల INDకు వస్తుందన్నారు. ఇస్రోకు చెందిన హెవీయెస్ట్ రాకెట్ LVM-3-M5 ద్వారా దీన్ని లాంచ్ చేయనున్నట్లు పేర్కొన్నారు. నాసాతో కలిసి సంయుక్తంగా డెవలప్ చేసిన అత్యంత ఖరీదైన <<17251299>>NISAR<<>> శాటిలైట్‌ను ఇస్రో జులై 30న విజయవంతంగా లాంచ్ చేసిన విషయం తెలిసిందే.