News December 13, 2024
ప్రియుడితో పెళ్లి.. కీర్తి సురేశ్ ఎమోషనల్
తన చిన్ననాటి స్నేహితుడు, ప్రియుడు అంథోనీని హీరోయిన్ కీర్తి సురేశ్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అంథోనీ తాళి కట్టిన తర్వాత ఆమె ఎమోషనల్ అయ్యారు. ఈ ఫొటోను హీరో నాని పంచుకున్నారు. ఈ మ్యాజికల్ క్షణాలను తాను ప్రత్యక్షంగా చూసినట్లు ట్వీట్ చేశారు. కీర్తి, నాని కలిసి దసరా, నేను లోకల్ చిత్రాల్లో నటించారు.
Similar News
News December 13, 2024
‘గుకేశ్పై లిరెన్ ఉద్దేశపూర్వకంగానే ఓడిపోయారు’
వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్లో చైనా ప్లేయర్ డింగ్ లిరెన్ ఉద్దేశపూర్వకంగా ఓడినట్లు రష్యా చెస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఆండ్రీ ఫిలాటోవ్ ఆరోపించారు. దీనిపై అంతర్జాతీయ చెస్ ఫెడరేషన్(FIDE) విచారణ జరపాలన్నారు. కీలక సెగ్మెంట్లో లిరెన్ పావుల కదిపిన తీరు అనుమానాస్పదంగా ఉందని చెప్పారు. ఫస్ట్ క్లాస్ ప్లేయర్తో ఓడిపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. 18ఏళ్ల గుకేశ్ వరల్డ్ ఛాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే.
News December 13, 2024
నేడు రాష్ట్ర వ్యాప్తంగా YCP పోరుబాట
AP: మద్దతు ధర లేక అల్లాడుతున్న అన్నదాతలకు అండగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా పోరుబాటకు సిద్ధమైనట్లు YCP ప్రకటించింది. రైతులతో కలిసి తమ నాయకులు కలెక్టరేట్లకు ర్యాలీగా వెళ్లి వినతిపత్రాలు అందజేస్తారని తెలిపింది. రైతుల గోడు ప్రభుత్వానికి తెలిసేలా నిరసన చేపట్టనున్నట్లు వివరించింది. ధాన్యం కొనుగోలు, రూ.20వేలు పెట్టుబడి సాయం తదితర సమస్యలపై YCP పోరాడుతుందని మాజీ CM జగన్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
News December 13, 2024
బాబోయ్.. ఇదేం చలి!
TG: రాష్ట్రంలోని పలు జిల్లాలను చలి వణికిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో క్రమంగా ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గురువారం కనిష్ఠ ఉష్ణోగ్రత 7°C నమోదైంది. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 9 వరకు చలి ప్రభావం ఉంటుండగా వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చలికి తోడు పొగమంచు కారణంగా వాహనదారులు లైట్లు వేసుకొని నెమ్మదిగా వెళ్లాలని పోలీసులు చెబుతున్నారు.