News January 23, 2025
WEF వ్యవస్థాపకుడితో మంత్రి శ్రీధర్ బాబు భేటీ

వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) వ్యవస్థాపకులు & ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ప్రొఫెసర్ ష్వాబ్ ను మంత్రి శ్రీధర్ బాబు మర్యాద పూర్వకంగా కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంధన వనరులు, సుస్థిర నగరాభివృద్ధి వంటి వివిధ అంశాలపై ఆయనతో చర్చించడం జరిగిందని అన్నారు. అలాగే సమగ్ర ఆర్థిక వ్యవస్థలను ఎలా నిర్మించాలో ప్రొఫెసర్ నుంచి సూచనలు తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు.
Similar News
News February 7, 2025
వాట్సాప్‌లో ఇంటర్ హాల్‌టికెట్లు.. టెన్త్ కూడా

AP: ఫీజులు చెల్లించలేదని ప్రైవేటు యాజమాన్యాలు విద్యార్థులకు హాల్‌టికెట్లు నిలిపివేసే ఘటనలకు ప్రభుత్వం చెక్ పెట్టింది. ఇంటర్ హాల్‌టికెట్లను వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందించాలని నిర్ణయించింది. 9552300009 నంబర్ ద్వారా విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. త్వరలో టెన్త్ విద్యార్థులకు సైతం ఇదే అవకాశం కల్పించాలని భావిస్తోంది. ఇంటర్ ప్రాక్టికల్స్ ఈ నెల 10-20 వరకు, పరీక్షలు మార్చి 1-20 వరకు జరుగుతాయి.
News February 7, 2025
గ్రూప్-1 ఫలితాలపై UPDATE

TG: రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షల ఆన్సర్ షీట్ల మూల్యాంకనం ముగిసింది. మరో 10 రోజుల్లో ఫలితాలు వెల్లడించేందుకు TGPSC కసరత్తు చేస్తోంది. 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా ఉండనుంది. ఈ పరీక్షలకు 21,093 మంది హాజరైన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగ నియామకాలు పూర్తయ్యాకే గ్రూప్-2, 3 ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. బ్యాక్‌లాగ్‌లు లేకుండా ఉండేందుకు ఇలా చర్యలు తీసుకుంటోంది.
News February 7, 2025
బీసీకి డిప్యూటీ సీఎం పదవి.. రేవంత్ యోచన?

TG: రాష్ట్రంలో బీసీల కేంద్రంగా తాజా రాజకీయాలు తిరుగుతున్న నేపథ్యంలో CM రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. క్యాబినెట్ విస్తరణలో ఇద్దరు BCలకు అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇందులో ఒక Dy.CM పదవి ఉంటుందని టాక్. ST, మైనార్టీ, రెడ్డి, వెలమ సామాజికవర్గాల నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేయాలనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ రాగానే ప్రకటన ఉంటుందని తెలుస్తోంది.